republichindustan.in
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 4:20 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

గంజాయి పై ఉక్కు పాదం – 20 రోజుల్లో 34 కేసులు : ఎస్పీ

1. ఎస్పీ అంటేనే వణుకుతున్న గంజాయి  స్మగ్లర్లు….
2. గంజాయి ని ఆదిలాబాద్ జిల్లాలో కనుమరుగు చేస్తాం
3. మార్చి 10 నుండి ఇప్పటివరకు 34 కేసులు నమోదు.
4. 12 కిలోల డ్రై గంజాయి, 181 గంజాయి మొక్కలు స్వాధీనం.
5. 56 మంది నిందితుల అరెస్ట్, జిల్లా లో ADB-NAB ద్వారా గంజాయి పై ఫోకస్.*
6. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాల నిర్వహణ, ఎలాంటి సమాచారం అయినా 8712659973 అందించవచ్చు.

ఆదిలాబాద్:  జిల్లా ప్రజలకు మాదకద్రవ్యాలు మరియు గంజాయి పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ చైతన్య పరిచయం జరుగుతుందని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఐపిఎస్ తెలియజేశారు.  ఆదిలాబాద్ జిల్లా నందు గంజాయి ని పూర్తిగా నిర్మూలించేవరకు జిల్లా పోలీసు యంత్రాంగం తగిన చర్యలను చేపడుతుందని తెలిపారు.జిల్లాలో గంజాయి వర్తక దారులను, పండించే వారిని, వినియోగదారులను   గంజాయి పై ఉక్కు పాదం వేసి అణచివేస్తామని తెలిపారు. ముఖ్యంగా యువత కు మారుమూల గ్రామాలలోని ప్రజలకు గంజాయి పై అవగాహన కల్పించి మరియు వాటి వల్ల కలిగే అనర్ధాలను తెలియజేసి చైతన్యపరచడం జరుగుతుందని తెలిపారు. గంజాయి పండించి వాటిని ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం ద్వారా వచ్చే లబ్ధి సౌకర్యాలను రాకుండా జిల్లా పాలనా యంత్రాంగానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. గంజాయి వర్తకులు వ్యాపారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, గంజాయి సరఫరాదారులు ప్రతి ఒక్కరిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు. గత నెల పదవ తారీకు నుండి ఇప్పటివరకు జిల్లాలో 34 గంజాయి కేసులు నమోదయ్యాయి, అందులో 56 మంది నిందితులను అదుపులోకి తీసుకొని కటకటాల కు తరలించడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు నమోదైన కేసులలో 12 కిలోల డ్రై గాంజా మరియు 181 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని వాటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 23,21,550/- లు ఉంటుందని తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!

అందరి సమిష్టి కృషితో ఎట్టి పరిస్థితుల్లోనూ గాంజాయ్ జిల్లాలో కనబడకుండా చేస్తాం అన్నారు. ఇప్పటివరకు జిల్లా  నందు గంజాయి సాగు చేస్తూ నమోదైన నాలుగు కేసులలో నిందితులకు ప్రభుత్వ పథకాలు రాకుండా చర్యలను తీసుకున్నట్లు తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో ADB-NAB (ఆదిలాబాద్ నార్కోటిక్ బ్యూరో) మొదలై చురుకుగా విధులు నిర్వర్తిస్తుందని, గంజాయిని పండించే వారిని వర్తకలను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. అదేవిధంగా గంజాయి పై మాదక ద్రవ్యాల పై ఎలాంటి సమాచారం అయినా 8712659973 నంబర్కు వాట్స్అప్ ద్వారా తెలియజేయాలని సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.