బజార్ హత్నూర్ , రిపబ్లిక్ హిందుస్థాన్ :
వృత్తి పరoగా పిల్లలకు సేవలు చేయడమే కాకుండా తాను సంపాదించిన దానిలో కొంత ఇతరులకు లాభం చేకూరాలని కోరుకొనే వారు చాల అరుదు అలాంటి వారిలో మహమ్మద్ షఫీ ఒకరు. ఈయన బజార్ హత్నూర్ ఎస్ సీ హాస్టల్లో గత 20 సంవత్సరాలనుండి పని చేస్తున్నారు. ఆయన పదవి విరమణ పొందిన కూడా తనకు వస్తున్న సగం జీతం ను కూడా ఇక్కడే ఉండి పిల్లలకు సేవలు చేయడమే కాకుండాi బజార్ హత్నూర్ గ్రామంలో జరిగే పలు సామాజిక, అధ్యాత్మిక కార్యక్రమం లో పాలు పంచుకొని తన వంతు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. అందుకే ఈయనను మనసున్న గొప్ప మనిషిగా పేర్కొనవచ్చు. ఈ రోజుల్లోనే కాదు ఏ రోజుల్లో అయిన అడగనిదే అమ్మ అయిన అన్నం పెట్టదు. కానీ బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని హాస్టల్ పని చేస్తున్న షఫీ బజార్ హత్నూర్ ఉన్నత పాఠశాలను సందర్శించి, పిల్లలకు మినరల్ వాటర్ సౌకర్యం లేకపోవడంతో ఆయన మనసు ఒప్పుకోలేదేమో వెంటనే పాఠశాలలో పిల్లలకు మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. అలాగే వివిధ కార్యక్రమాల నిర్వహణకు స్టేజిపైకప్పు లేకపోవడం గమనించి స్టేజిపైకప్పు కూడా వేయించి తన దాతృత్వం చాటుకున్నారు. ఈ రెండు పనుల నిమిత్తం తను సొంతంగా సంపాదించిన డబ్బుల నుంచి రూపాయలు 50 వేల వరకు వారం రోజులలోనే ఖర్చు చేసిపైన పేర్కొన్న సౌకర్యాలు కల్పించారు. ఆయన గొప్ప మనసు,దాతృత్వానికి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.పలువురు షఫీకి అభినందనలు తెలిపారు.