అదిలాబాద్ : అడవులు గలగలపారే నదులు ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ప్రాణాలకు తెగించి రెండు కిలోమీటర్ల దూరం నడిచి గిరిజన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించారు. అడవిలో రెండు కిలోమీటర్లు బురద లో కాలినడకన నడవడంతో పాటు పారుతున్న నదిలో నుంచి ప్రాణాలకు తెగించి వెళ్లి గిరిజనులకు వైద్య సేవలు అందించారు.
Thank you for reading this post, don't forget to subscribe!

గాది గూడ మండలంలోని ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని అర్జుని జి గ్రామపంచాయతీ పరిధిలోని మారు గూడ గిరిజన గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది కాలినడకన రెండు కిలోమీటర్ల నడిచి మారూగుడ గిరిజన గ్రామంలో వైద్య సేవలు అందించారు.
ప్రాణాలకు తెగించి వైద్య సేవలు అందించిన ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి మనందరం ధన్యవాదాలు తెలుపవలసిన అవసరం ఉంది. మామూలు వర్షం పడితేనే మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేము ప్రవహించే నది రెండు కిలోమీటర్ల బురదలు నడుస్తూ వైద్య సేవలకు వెళ్లారంటే వైద్య సిబ్బందినీ అభినందించవలసిందే…
వర్షాకాలం కావడం వల్ల గ్రామంలోని 38 గృహాల్లో రాపిడ్ సర్వే ను చేపట్టారు. జర సర్వే చేపట్టగా జ్వరం కేసులు నమోదు కాలేదు యాంక్ చెకప్ రెండు కేసులు చేయగా టిబి స్క్రీనింగ్ 20 టెస్ట్ చేశారు.
ఎన్సీడీ స్క్రీనింగ్ 17 మందికి చేయగా కొత్తగా ఎన్సీడీ కేసులు ఏం నమోదు కాలేదు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సిబ్బందిని అభినందించారు.