రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండలంలోని మెడిగుడా బాలికల ఆశ్రమ పాఠశాలను ఇచ్చోడ తహసీల్దార్ అతికొద్దీన్ తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెడిగూడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆహార ధాన్యాలు, రికార్డులు మరియు పారిశుధ్యం నిర్వహణ ను తనిఖీ చేశారు.మెనూ ప్రకారం ఆహారం అందించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ జాదవ్ రామారావు మరియు సిబ్బంది ఉన్నారు.