వార్తలు రాయొద్దు…. రాయద్దంటే రాయద్దు.. : ఎంపీపీ
Thank you for reading this post, don't forget to subscribe!
పోలీసులను కూడా అతి దారుణ బాషా , రాయలేని తిట్లు …. వీడియో వైరల్
ఇచ్చోడ మండల కేంద్రం చుట్టూ కొనసాగుతున్న అక్రమ వెంచర్ దందా పై వార్తలు రాస్తే ఇదే గతి పడుతుందని పబ్లిక్ బెదిరిస్తున్న సదరు ఎంపిపి ని ఎవరు ఏమి చేయరు అనే అహంకారం , ధనబలం , అధికారులు తన ప్యాకెట్ లో ఉంటారనుకున్నాడో ఏమో….
అప్పుడప్పుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో తాను దిగిన ఫొటోలు పెట్టుకుని ఎవరు.. ఎక్కడ కూడా తన అక్రమ సామ్రాజ్యానికి అడ్డు రారు అని బహిరంగంగా మాట్లాడు కోవడం కొసమెరుపు.
నా డబ్బు నా ఇష్టం లే అవుట్లు తీస్తా.. ఏమన్నా చేస్తా… ఎవరి గుద్దల దమ్ము లేదు అని బాహాటంగానే పలుకుతున్నాడు.
*కులాలను తిట్టడం, అవహేళన చేయడంలోను నెం1 ఆ ఎంపీపీ…*
ఇచ్చోడ ఎంపిపి గతంలో కూడా ఓ రిపోర్టర్ ను బెదిరింపులకు గురిచేసి , ఆదివాసీ ల గురించి అవమానకర రీతిలో మాట్లాడంతో చివరికి తప్పు తెలుసుకుని ఆదివాసీల సమక్షంలో క్షమాపణ చెప్పాడు… అయిన మారని తీరు…. సదరు ఎంపిపి ఇంత జరిగినా ప్రస్తుతం కూడా అదే మోతేబరి ధీమాక్ తో నేనె దాదా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.
అయితే పోలీసుల గురించి కూడా అతి దారుణమైన భాషను వాడుతున్నట్లు వీడియో లో స్పష్టంగా ఉంది…
*జర్నలిస్ట్ పై దాడి సమయంలో*
జర్నలిస్ట్ పై దాడి సమయంలో ఎంపిపి తో పాటు మరో వ్యక్తి (ప్రభుత్వ ఉద్యోగి) కూడా రెచ్చిపోయాడు. ఎస్సై ఎవరు సు… గాడు… సిఐ ఎవడు సు… గాడు అని రెచ్చిపోతున్న వీడియో ఒకటి బయటికొచ్చింది.
రేపటి రోజు ఏమో చేస్తాడో ఎవరి చేత దాడలు చేస్తారో అని ఆ ఎపిపి తో సామాన్య జనం భయపడుతున్నారు.
కేటీఆర్ తో ఫొటోలు ఉండడం తో ఆ ఎంపిపి జోలికి వెళ్ళడానికి అధికారులు కూడా బయపడుతున్నట్లు తెలుస్తోంది.
జర్నలిస్టుపై విచక్షణ రహితంగా దాడి..
– వెంచర్ల పై వార్త రాసినందుకు ఓ ప్రజాప్రతినిది తో పాటు దాడికి పాల్పడ్డ హోంగార్డు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో: అక్రమ వెంచర్ల పై వరుస కథనాలు రాస్తునందుకు ఓ పత్రిక ఎడిటర్ పై ఓ ప్రజాప్రతినిధి మరియు హోంగార్డు కలిసి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు.
కొన్ని రోజుల నుండి ఏజెన్సీ ప్రాంతమైన ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటవుతున్న ఇల్లిగల్ లే అవుట్ల పై వార్తలు రాసినందుకు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. రోజురోజుకు వాస్తవ కథనాలు రాస్తున్న జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతుంది. సభ్య సమాజం తలదించుకునేలా ఒక జర్నలిస్ట్ పై విచక్షణ రహితంగా దాడి జరిగింది. నేను…ఏర్పాటు చేసిన వెంచర్ల పైనే వార్తలు రాస్తావా అని ఇచ్చోడ ఎంపీపీ ప్రీతం రెడ్డి తో పాటు పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న మామిడి విజయ్ లు వాస్తవ నేస్తం దినపత్రిక ఎడిటర్ పై విచక్షణ రహితంగా దాడి చేసిన సంఘటన ఇచ్చోడ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలో సోమవారం ఒక జర్నలిస్టు కూతురి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లిన జర్నలిస్టుపై, అక్కడే ముందుగా వెళ్లి ఉన్న ఎంపీపీ ప్రీతం రెడ్డి, మామిడి విజయ్ లు జర్నలిస్టు పై బూతులు మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాలలో ఏర్పాటు అవుతున్న అక్రమ వెంచర్ల కథనాలు ప్రచురితమైన వాస్తవ నేస్తం దినపత్రిక ఎడిటర్ పై ఒకేసారి ఇద్దరూ విచక్షణ రహితంగా దాడికి దిగారు. కొందరు జర్నలిస్టుల సహకారంతో అక్కడ నుండి బయటపడ్డ సదరు జర్నలిస్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే ఏ కేటగిరి తెలియని వ్యక్తి కావాలనే ఓ అక్రమ కేసును తన ప్రజాప్రతినిధి హోదాతో పెట్టించే ప్రయత్నం చేస్తున్నట్లు గా తెలుస్తోంది.
వాస్తవ కథనాలు రాసిన జర్నలిస్టు పై దాడిని పలు జర్నలిస్టుల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు.
జర్నలిస్టుపై దాడి చేసిన వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
*ఇల్లిగల్ లే అవుట్ల పై స్పందించని అధికారులు…..!*
ఇల్లిగ లే అవుట్ల పై అధికారులు స్పందించడం లేదు, కానీ రియల్ మాఫియా మాత్రం తప్పును ఎత్తిచూపితే దాడికి దిగుతున్న సంఘటనలు తరుచు జరుగుతున్నయి. ప్రజా పక్షాన నిలుస్తూ నిస్వార్ధం గా సేవలు అందించే నాలోగో స్థంభం పైనే దాడికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలాంటి అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలని రిపబ్లిక్ హిందుస్థాన్ డిమాండ్ చేస్తుంది.