డాక్టర్ నిర్లక్ష్యం వల్లే మృతిచెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ…
Thank you for reading this post, don't forget to subscribe!
ఆసుపత్రిలో ఆందోళన కుటుంబ…
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలములోని ఇచ్చోడ తండాకు చెందిన వ్యక్తి ఇంజెక్షన్ వికటించి మృతిచెందిన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. మృతుడు చౌహన్ విజయ్(35) తండ్రి చౌహన్ భారత్ మరియు మృతుని భార్య చౌహన్ లలిత తెలిపిన వివరాల ప్రకారం తన కొడుకు అనారోగ్యానికి గురి కావడం తో రిమ్స్ కు వైద్యం కోసం తీసుకెళ్లామని అన్నారు. అక్కడ చికిత్స చేసిన డాక్టర్లు ఓ ఖరీదైన ఇంజెక్షన్ రాసినట్లు , అప్పుడు తమ వద్ద డబ్బులు లేకపోవడంతో ఇంటికి వచ్చి డబ్బులు జమ చేసుకుని నిర్మల్ నుండి ఇంజెక్షన్ కొనుక్కుని తీసుకొచ్చినట్లు తెలిపాడు. అలా తీసుకొచ్చిన ఇంజెక్షన్ ను ఇచ్చోడ లో ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో ఓ డాక్టర్ ఇంజెక్షన్ చేయగా ఇంజెక్షన్ వికటించి కడుపు ఉబ్బి శనివారం తన కొడుకు చనిపోయాడని ఆరోపించారు. కనీసం వెనుక ముందు ఆలోచించకుండా ఇంజెక్షన్ చేసిన డాక్టర్ నిర్లక్ష్యం వల్ల తన కొడుకు చనిపోయాడని హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.
