రిపబ్లిక్ హిందుస్థాన్ | ఆదిలాబాద్ | నవంబర్ 3 :
భార్యను క్రూరంగా హత్య చేసిన నిందితుడికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. ప్రభాకర్ రావు
భీంపూర్ కొలంగూడా గ్రామం, నార్నూర్ మండలానికి చెందిన నిందితుడు ఆత్రం మారుతి (36) కి యావజీవ కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించారు.
వివరాల ప్రకారం, 2025 ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 11:30 గంటలకు నిందితుడు తన భార్య ఆత్రం రుక్కుబాయి (26)పై అక్రమ సంబంధాల అనుమానం వ్యక్తం చేస్తూ గొడవ పడి, బండరాయితో తలపై, ఛాతిపై కొట్టి హత్య చేశాడు. బాధితురాలి కేకలు విని గ్రామస్తులు చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు.
తదుపరి బాధితురాలి సోదరుడు సిడాం గంగారం ఫిర్యాదు మేరకు నార్నూర్ సీఐ రహీం పాషా కేసు నమోదు చేసి, 103 BNS (మునుపటి 302 IPC) కింద దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం కేసు కోర్టుకు పంపగా, లైసెన్ ఆఫీసర్ ఎం. గంగాసింగ్ మరియు కోర్టు డ్యూటీ అధికారి జాదవ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 9 మంది సాక్షులను కోర్టుకు హాజరుపరిచారు.
పిపి A. A. రహీం నిందితునిపై ఆరోపణలను నిరూపించగా, జిల్లా ప్రధాన న్యాయమూర్తి కే. ప్రభాకర్ రావు నిందితుడు దోషి అని తేల్చి యావజీవ కఠిన కారాగార శిక్ష మరియు రూ.1000 జరిమానా విధించారు.
8 నెలలలోనే విచారణ పూర్తిచేయడం ద్వారా న్యాయవ్యవస్థ వేగంగా న్యాయం అందించిందని అధికారులు తెలిపారు.
ఈ కేసు దర్యాప్తు మరియు సాక్ష్యాధారాల సేకరణలో కృషి చేసిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐ.పి.ఎస్. ప్రత్యేకంగా అభినందించారు.
Thank you for reading this post, don't forget to subscribe!