Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, మంచిర్యాల (జనవరి 19) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పోస్ట్ ఆఫీస్ బస్తిలోని క్వార్టర్ నంబర్ ఎస్అర్ టి 134 ను బండారి రవి అనే హోంగార్డ్ కబ్జా చేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని బాధితులు సురేష్ కుమార్,రాజేష్ లు వాపోయారు. గురువారం బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బండారి రవి అనే హోంగార్డ్ తన ఇంటిని అద్దెకు తీసుకొని,అద్దె డబ్బులు ఇవ్వకపొగ,ఇల్లు నాదే,ఇంటి పక్కన క్వార్టర్ నాదే, అని అంటున్నాడని ఇంటిని,క్వార్టర్ ను కబ్జా చేసాను, నేనే నాకున్న పలుకుబడితో కరెంటు కనెక్షన్ తీసుకున్నానని, మీరు ఏం చేస్తారో చేసుకొండి,ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, నాకు పోలీసు అధికారి బిపిఎల్ అండదండలు ఉన్నాయని, అంటు మాపై దాడికి పాల్పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో మున్సిపాలిటీ అధికారులు నోటీస్ లు జారీ చేసి హెచ్చరించిన ఫలితం లేదని జరిగిన సంఘటనలను పోలీసులకు ఫిర్యాదు చేస్తే భూములు, ఇళ్ల వ్యవహారం సివిల్ మ్యాటర్ అయినందున మేము ఏమీ చేయలేమని అంటున్నారని, స్థానిక రెవెన్యూ, మున్సిపల్, పోలీసు అధికారులు వెంటనే స్పందించి, మా క్వార్టర్ ను మాకు ఇప్పించి, హోంగార్డ్ బండారి రవి పై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.