republichindustan.in
Newspaper Banner
Date of Publish : 06 December 2023, 12:37 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

హోంగార్డులు పేన్షన్ పథకాలలో చేరడం ఉత్తమం – జిల్లా ఎస్పీ

⚙️ ఘనంగా హోంగార్డు ల రైజింగ్ డే ఉత్సవం నిర్వహణ

⚙️ ఏఆర్ హెడ్ కోటర్స్ నుండి కలెక్టర్ చౌరస్తా వరకు ర్యాలీ

Thank you for reading this post, don't forget to subscribe!

⚙️ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్:
నిజానికి ఈ హోంగార్డులు స్వతంత్ర భారతదేశంలో స్వచ్ఛంద సంస్థగా 1946 డిసెంబర్ 6వ తేదీన ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. కావున ప్రతి సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన *హోంగార్డు రైజింగ్ డే* గా నిర్వహించడం జరుగుతుంది. బుధవారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని హోంగార్డు జిల్లా కార్యాలయంలో ఉదయం హోంగార్డ్ రైసింగ్ డే ఉత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పాల్గొని హోంగార్డ్ రైసింగ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

మొదటగా హోంగార్డ్ యూనిట్ ద్వారా ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి, హోంగార్డుల జెండాను ఆవిష్కరించారు. తదనంతరం జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా మాట్లాడుతూ హోంగార్డు రైసింగ్ డే సందర్భంగా హోంగార్డులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, హోంగార్డులకు పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం ద్వారా పెన్షన్ ఉండదు కావున ఉద్యోగంలో ఉన్నప్పుడే ప్రభుత్వ, ప్రైవేటు పెన్షన్ పథకాలలో చేరడం ఉత్తమమని హోంగార్డులకు సూచించారు. పోలీసులతో సమానంగా నిస్వార్థమైన విధులు నిర్వర్తిస్తున్నారని, హోంగార్డుల సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారాలను కృషి చేస్తానని తెలియజేశారు. ముఖ్యంగా హోంగార్డులు సమయానసారంగా విధులకు హాజరవుతూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో సమానంగా పనిచేస్తున్నారని తెలిపారు. అన్ని క్లిష్టతరమైన బందోబస్తులు, శాంతి భద్రతల పరిరక్షణలో నిర్వహించే పోలీసుల అన్ని విభాగాల్లో హోంగార్డుల సైతం తమ వంతు సహకారం అందిస్తున్నారని తెలిపారు. తమకు కేటాయించిన విధులను సక్రమంగా పాటిస్తూన్నారని తెలిపారు. అనంతరం హోంగార్డు అధికారులు పోలీసు అధికారులు కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రాలిని జిల్లా ఎస్పీ జెండా ద్వారా ప్రారంభించారు. ర్యాలీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ప్రారంభమై కలెక్టర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వి ఉమేందర్, సిహెచ్ నాగేందర్, పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు స్వామి, నవీన్, మురళి పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, హోంగార్డ్ ఆఫీస్ అధికారులు రమేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.