republichindustan.in
Newspaper Banner
Date of Publish : 07 November 2024, 5:09 am Digital Edition : REPUBLIC HINDUSTAN

పిడుగురాళ్ల పట్టణం ఐలాండ్ సెంటర్లో హిందూ సంస్థల ఆధ్వర్యంలో వానర సేన ధర్నా<br>

పల్నాడు :  జిల్లాలోని గురజాల నియోజకవర్గం  పిడుగురాళ్ల పట్టణంలో  శ్రీ అర్వపల్లి బాపమ్మ ధర్మ సత్రం చెందిన షాపుల్లో అన్యమతస్తుల షాపులు తొలగించాలని ధర్నా . చేపట్టిన ఓనరసేన
అధికారులను ఎన్ని సార్లు అర్జీ పెట్టిన కూడా పట్టించుకోవడంలేదని ఆవేదన హిందూ సంస్థలు
అర్వపల్లి బాపమ్మ సత్రం అన్నదానానికి, సంబంధించింది  గా హిందూ సంస్థలు వెల్లడించాయి.

అన్యమతస్తులకు అద్దెలకిచ్చి అపవిత్రం చేస్తున్నారని హిందూ సంస్థల ఆధ్వర్యంలో వానర  సేన  ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా విశ్వ సమాజం పీఠాధిపతులు  వీర ధర్మజ స్వామీజీ వారు  మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను  ఖండిస్తూ హిందూ దేవాలయాలు ముందు మరియు సత్రాలలో  అన్య మతస్తుల  వ్యాపార వ్యవహార శైలిని  నిలుపుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు   డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని  కోరారు.

Thank you for reading this post, don't forget to subscribe!

మరియు ఈ సందర్భంగా హిందూ జన జాగృతి సంఘం రాష్ట్ర అధ్యక్షులు చేతన్ ఘడి మాట్లాడుతూ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణంలో ఆక్రమణకు గురైన అర్వపల్లి బాపమ్మ సత్రం లో గల షాపుల ముందు ఉన్న ఆర్& బి రోడ్డు ను ఆక్రమించుకొని నిర్వహించబడుతున్నటువంటి వ్యాపార వ్యవహారములను నిలుపుదల చేయాలని  అలానే సత్రము ముందు ఉన్న  హోర్డింగ్లు  తొలగించాలని ఆరవపల్లి బాపమ్మ సత్రం ప్రజలకు కనిపించే విధముగా చర్యలు తీసుకోవాలని భవిష్యత్తులో ఆక్రమణలకు గురి కాకుండా  తగిన చర్యలు తీసుకోవాలని తగిన శాఖ కార్య నిర్వహణ అధికారి నీ కోరడం జరిగినది.

ఈ సందర్భంగా సంఘటన స్థలానికి చేరుకున్న మున్సిపల్ అధికారులు,, పోలీస్ అధికారులు హిందూ సంస్థల స్వామీజీలతో  చర్చించి మీకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో  విరమించిన ధర్నా
ఈ యొక్క కార్యక్రమంలో విశ్వ సమాజం మరియు
వీరబ్రహ్మేంద్ర స్వామి పీఠం స్వామీజీ వీర ధర్మజ స్వామీజీ
హిందూ జనజాగృతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు చైతన్ గాడి వారు మరియు
హిందూ వాహిని రాష్ట్ర అధ్యక్షులు సుబ్బలక్ష్మి,
హిందూ చైతన్య వేదిక
గుంటూరు జిల్లా అధ్యక్షులు వీరేంద్ర కుమార్, వీరబ్రహ్మేంద్ర  ప్రచార మండలి  అధ్యక్షులు కుంకు బాలాజీ ,వానర సేన  పల్నాడు జిల్లా అధ్యక్షుడు డేరంగుల శ్రీనివాస్
మరియు పిడుగురాళ్ల పట్టణ వానర సేన కమిటీ సభ్యులు పట్టణ హిందూ సమాజ సభ్యులు పాల్గొన్నారు.