Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : రాజ్యాంగం మార్చాలాంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ లో బీజేపీ ఆందోళనకు దిగింది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యలయం నుండి పట్టణ ప్రధాన విధుల గుండా కలెక్టరేట్ వరకు అంబేద్కర్ చిత్రపటంతో నల్లటి ఖండువాలను ధరించి ర్యాలీ చేపట్టారు. దారి పొడవున జై భీం జై శ్రీరామ్ అంటూ నినాధాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం కొమురం భీం చౌక్ వద్ద కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు పాయల్ శంకర్ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అవమానపర్చేవిధంగా సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, బీజేపీ నాయకులు వేణుగోపాల్,దినేష్,సోమారవి,గందే కృష్ణ కుమార్,ప్రవీణ్ రెడ్డి,పాయల్ శరత్,రాష్ట్రపాల్ మరియు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.