•సినీ పక్కిలో వాహనాన్ని ఛేజ్ చేసి గుట్కా పట్టుకున్న పోలీసులు….
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ క్రైమ్:
నిషేధిత గుట్కాను పట్టుకున్నట్లు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నిర్మల్ నుండి ఆదిలాబాద్ కు ఒక వాహనంలో నిషేధిత గుట్కా సరఫరా అవుతుందని సమాచారం మేరకు పోలీస్ లు దేవాపూర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో రూ.1.1 లక్షల విలువచేసే నిషేధిత గుట్కా(అంబర్) లభించిందని ఆయన తెలిపారు.నిందితుడు అర్బాజ్ జిల్లా కేంద్రంలో ఒక ఏజెన్సీ నిర్వహిస్తున్నారని తెలిపారు.నిందితున్ని సినీఫక్కీలో తరహాలో వెంబడించి దేవాపూర్ చెక్ పోస్ట్ వద్ద అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఎస్సై అశోక్,సిబ్బంది జాకీర్,రమేష్,ఏసుదాస్ తదితరులు పాల్గొన్నారు.