రిపబ్లిక్ హిందూస్థాన్ : దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పల్లె నుంచి పట్టణం వరకు , శుక్రవారం రోజు విధివీధినా ప్రతిఇంట గణనాథుడు కొలువుదీరి పూజలందుకున్నాడు. భక్తులు భక్తితో ఉండ్రాలు , ప్రత్యెక పిండివంటలు చేసి గణనాథుడిని నైవేద్యాలు గా సమర్పించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు.
కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వాలు విధించిన నిబంధనలను పాటిస్తూ భక్తులు పూజలు చేశారు.
వినాయక చవితి సందర్భంగా ఎంతో మంది చిరు వ్యాపారుల మోములో ఆనందం వెల్లువిరిసింది. పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో పూజ సామగ్రిని ప్రజలు కొనుగోలు చేశారు.
Thank you for reading this post, don't forget to subscribe!