republichindustan.in
Newspaper Banner
Date of Publish : 30 August 2024, 4:44 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలి – జిల్లా ఎస్పీ

పర్యావరణ పరిరక్షణకై మట్టి వినాయక ప్రతిష్టాపనకు ప్రాధాన్యత కేటాయించాలి.
వెబ్సైట్ నందు పూర్తి వివరాలను నమోదు చేసి అనుమతులు పొందాలి

Thank you for reading this post, don't forget to subscribe!

  • జిల్లా ఎస్పీ గౌస్ ఆలం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :

ఆదిలాబాద్ జిల్లా నందు రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పూర్తి సంసిద్ధమై జిల్లా పోలీసు యంత్రాంగం ఉందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ, జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్న గణేష్ మండప నిర్వాహకులు, సభ్యులు, కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ వారు రూపొందించిన గణేష్ మండప నిర్వహణకు సంబంధించి ఆన్లైన్ వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/ లో వివరాలను నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ వెబ్సైట్ నందు వినాయక మండప వివరాలు, వినాయక చవితి మొదలు, నిమజ్జన తేదీ, సమయం, ప్రయాణించే దారి, మండప ప్రదేశం, ప్రదేశం ఓనర్ వివరాలు, గణపతి విగ్రహ ఎత్తు, మండపం యొక్క ఎత్తు, సంబంధిత పోలీస్ స్టేషన్, నిమర్జనం ప్రదేశం, మండపము కు సంబంధించిన సమాచారం పొందుపరచాలని సూచించారు. జిల్లాలోని పట్టణాలలో మరియు గ్రామాలలో నిర్వహించే గణపతి మండప నిర్వహకులు ఈ వెబ్సైట్ నందు వివరాలను పొందుపరచాలని సూచించారు. ఆన్లైన్ ద్వారా కానీ సందర్భంలో దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయక ప్రతిష్టాపనకు ప్రాధాన్యత కేటాయించాలని తెలిపారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైనా జిల్లా పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో అప్రమత్తంగా ఉంటుందని వెంటనే డయల్ 100 కు సంప్రదించాలని తెలియజేశారు.