republichindustan.in
Newspaper Banner
Date of Publish : 09 August 2022, 2:11 pm Editor : REPUBLIC HINDUSTAN

ఫ్రీడమ్ రన్ ను విజయవంతం చేయండి

🔶 జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఫ్రీడమ్ రన్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపు 

Thank you for reading this post, don't forget to subscribe!

🔶 ఆదిలాబాద్ పట్టణంలో ఆగస్ట్ 11 వ తారీకు ఉదయం 6:00 నిమిషాలకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభం

రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :  భారతదేశం 75వ స్వతంత్ర దినోత్సవ వారోత్సవాలని పురస్కరించుకొని ఆగస్టు 11వ తారీఖున జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో మరియు పట్టణాల్లో *ఫ్రీడం రన్* ను నిర్వహించాలని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ ఈ ఉత్సవాలలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈతరం విద్యార్థినీ విద్యార్థులకు, యువతకు స్వతంత్రం తీసుకువచ్చిన మహనీయుల ఘన చరిత్ర గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడానికి, స్వతంత్రం తీసుకురావడానికి ఎందరో మహనీయుల ప్రాణత్యాగం, వారి నిస్వార్ధమైన సేవలు, త్యాగఫలం ఈరోజు మనం అనుభవిస్తున్న, జీవిస్తున్న స్వతంత్ర భారతదేశ అని వారి జ్ఞాపకార్థం ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని, అందులో భాగంగానే ఆగస్టు 11న నిర్వహించే *ఫ్రీడం రన్* ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ కృత నిశ్చయంతో ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ఫ్రీడం రన్ 11వ తారీకు ఉదయం 6:00 గంటలకు స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం నుండి ప్రారంభం కానుందని పట్టణంలోని ప్రజలు ఇక్కడికి రావాలని కోరారు. అలాగే మండల స్థాయిలో ప్రతి గ్రామానికి ఒక పోలీసు అధికారిని కేటాయించినట్లు, ప్రతి గ్రామం నుండి 25 మంది సభ్యులు,యువకులు పాల్గొని మండల కేంద్రాల్లోని ఈ *ఫ్రీడమ్ రన్* లలో ఎస్ఐల పర్యవేక్షణ నందు  విజయవంతం చేయాలని, పట్టణంలో ప్రతి వార్డుకు ఒక పోలీసు అధికారి చొప్పున కేటాయించి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు, సీఐ ల పర్యవేక్షణలో ఈ ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తామని తెలియజేశారు.