republichindustan.in
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 4:59 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

లో ఓల్టేజి విద్యుత్ సరఫరా సమస్య పరిష్కారం

ఇచ్చోడ:  జామిడి గ్రామంలో గత కొన్ని నెలలుగా లో  ఓల్టేజి సమస్య  వల్ల నిత్యం విద్యుత్ సరఫరా లో అంతరాయం రావడంతో , ఈ సమస్య గ్రామస్తులు సర్పంచ్ గణపత్ మరియు ఉప సర్పంచ్ సుభాష్  పాన్పట్టే దృష్టి తీసుకెళ్లగా … ఈ సమస్యను వారు ఇచ్చోడ విద్యుత్ శాఖ అధికారి రాజు తెలిపారు . అయితే  ఈరోజు కొత్త మినీ ట్రాన్స్ఫర్ ను ఏర్పాటు చేసి లో ఓల్టేజి సమస్య పరిష్కారం చేయడంతో ఉప సర్పంచ్ సుభాష్ పాన్పట్టే ను కాలనీ వాసులు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు విజయ్  సిబ్బంది సంతోష్ మరియు గ్రామస్తులు ఉన్నారు.