దైవ దర్శనం అనంతరం…. చెరువులో ఊపిరాడక ఒకరి మృతి
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : అదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండలంలోని సిరిచెల్మా గ్రామంలో మంగళవారం రొజు పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. నాగులు పంచమి పండుగను పురస్కరించుకొని ఎల్లమ్మ గూడా గ్రామానికి చెందిన పెందురు భుజంగ్ రావ్ అనే వ్యక్తి దైవదర్శనానికి వెళ్లి చెరువులో మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఎల్లమ్మగూడా గ్రామానికి చెందిన పెందూర్ బొజ్జు సిరిచేల్మా గుడి దర్శనానికి చెరువులో పడవ ఎక్కకుండా ఈదుకుంటూనే వెళ్లి దేవ్వున్ని దర్శించుకున్నాడు. అయితే తిరిగి ఈదుకుంటూ వచ్చే క్రమంలో అంతగా ఈత రాకపోవడం తో నీటిలో మునిగి ఊపిరాడలేదు. గమనించిన కొందరు పడవ ఎక్కమని కోరగా నేను ఈదుకుంటూనే వస్తానని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. అయితె చెరువు మార్గ మధ్యలో వచ్చి ఒక్కసారిగా మునిగి పోయాడు. రెండు మూడు నిమిషాల అనంతరం ఎక్కడున్నావారు చెరువులో వెతకగా శవమై తేలాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.