రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ :
రైతులు స్ప్రే మందు ను వాడేటప్పుడు వ్యక్తిగత పరిశుబ్రత పై తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి టీఎంఐ హైదరాబాద్, సింజెంట కంపెనీ అధ్వర్యంలో ఇచ్చోడ మండలం కామగిరి గ్రామంలో బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. సింజెంట ప్రోగ్రాం ప్రాజెక్ట్ మేనేజర్ అశోక్ రెడ్డి అద్వర్యంలో ఈ సదస్సును నిర్వహించారు.ఈ సందర్బంగా సమన్వయకర్త కార్తీక్ ట్రైనర్లు శరత్,వెంకటేష్ మాట్లాడుతూ..స్ప్రే చేసేప్పుడు మాస్క్ లు దరించాలని,కళ్లజోడు పెట్టుకోవాలని సూచించారు.శరీరంపై మందు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బూట్లు వేసుకోవాలని,మందు కొట్టిన తరువాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోని స్నానం కూడా చేయమని, స్ప్రే చేసిన కాళీ మందుడబ్బలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా భూమిలో పాతిపెట్టాలన్నారు.చిన్నపిల్లలకు స్ప్రే మందులు అందుబాటులో లేకుండా చూడాలన్నారు ఈ జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని సూచించారు. కరోన వైరస్ వ్యాప్తి చెందకుండా రైతులు ముసుగు లు దరిస్తు భౌతిక దూరం ని పాటించాలని సూచించారు. కరోణ నియమాలు పతిస్తు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు పై రైతులు సంతృప్తి వ్యక్తపరుస్తు సింజెంట కంపెనీ వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచు తొడసం భీమ్ రావ్ రైతులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!