వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతన్న…!
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : దేశానికీ అన్నం పెట్టె రైతన్నకు ఈ సంవత్సరం అంతగా కలిసి రాలేదు. ఓ పక్క భారీ వర్షాలకు భారీగా నష్టపోయాయినా రైతన్నలు కొందరుంటే , మరో పక్క ఎలాగోలా పంటను రక్షించుకున్నా వారు కొందరు. అయితే గ్రామాలలో, వ్యవసాయ క్షేత్రాలలో తిరిగి రైతులకు పంటల సాగు పై అవగాహన కల్పించాల్సిన మండల వ్యవసాయ శాఖ అధికారులు పత్తా లేకుండా ఉన్నారు. కాలాన్ని బట్టి, రైతుల పంట స్థితి ని బట్టి మందుల పిచికారీ మొదలు రైతులు తీసుకోవాల్సిన జాగ్రతల పై అవగాహన కల్పించాల్సిన అధికారులు కరువయ్యారు.
కొంతమంది వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు తమకు ఫోన్ కాంటాక్ట్ కు అందుబాటులో ఉన్నవారికి, మరియు గ్రామపంచాయతీ కీ వెలితే సదరు గ్రామపంచాయతీ సర్పంచ్ దగ్గరి వారితో ఫొటో దిగి మీడియా ప్రచారం చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులకు, వారికి నిత్యం ఫోన్ లో టచ్ లో ఉండే వారికి ముందే ఫోన్ చేసి వారి పొలాలు చూసి ఫొటో ను తామే స్వయంగా మీడియా కీ పంపిస్తున్నట్లు తెలుస్తుంది. కొన్ని సందర్భాలలో చిన్నపిల్లలు సైతం రైతుల వరుసలో ఉంటు ఫొటో దిగిన సందర్భాలు ఉన్నాయి. అధికారులు పంటల సాగు పై ఒకప్పుడు ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టే వారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు వాటికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రత్తి పంట ఉన్నటుండి మొక్కలు ఎండిపోతున్నాయి. ప్రత్తి చెట్లు ఒక్కసారిగా పైకి ఎలాంటి రోగం గాని , చిడపురుగులు ఆశించకుండానే చెట్లు చనిపోతున్నాయి.
ఈ విషయం లో రైతులకు అవగాహనా కల్పించే అధికారులు ఎక్కడ…!? అని రైతులు ఎదురు చూస్తున్నారు.

మందుల వాడకంలో వ్యవసాయ అధికారుల నుండి ఎలాంటి సలహాలు, సూచనలు లేక రైతులు ఫర్టిలైజర్ దుకాణదారులు సూచించే మందులు కొని నష్టపోతున్నారు. ఇష్టం వచ్చిన మందులను ఫర్టిలైజర్ షాపులు రైతులకు అంటగడుతున్నారు.
ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి రైతులు నష్టపోకుండా చూడాలని మండల రైతులు కోరుతున్నరు