republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 October 2021, 1:28 pm Digital Edition : REPUBLIC HINDUSTAN

అప్పుల బాధతో యువ కౌలు రైతు ఆత్మహత్య…<br>

రిపుబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ : ఓ పక్క చేసిన అప్పులు ఎలా తీర్చాల నే భాద , మరో పక్క కురుస్తున్న అకాల భారీ వర్షాలతో జరిగిన పంట నష్టం చూసి యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బోథ్ మండలంలోని సోనాల గ్రామానికి చెందిన యువ కౌలు రైతు శశిధర్( 30) ఈ సంవత్సరం సొయా పంటను వేశాడు. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు కురవడంతో సొయా పంట మొక్కల పైనే మొలకెత్తింది. వేసిన సొయా పంట నష్ట పోవడంతో ఇది చూసి చలించిపోయాడు. దీనితో చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బాధతో వ్యవసాయ క్షేత్రంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Thank you for reading this post, don't forget to subscribe!