రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ : జిల్లాలోని నేరేడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన పెందూరు మారుతి అనే గిరిజన రైతు అకాల వర్షాలకు నష్టపోయిన పంట గురించి ఆలోచించి మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. గత మూడు సంవత్సరాల క్రితం తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబ భారం మొత్తాన్ని మోస్తూన్న మారుతి. చేసిన అప్పుల గురించి ఆలోచిస్తూ, బాధలో బుధవారం రాత్రి పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం నిర్మల్ ఆసుపత్రికి తీసుకువెళ్ళుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడికి ఇద్దరక్కచెల్లెలు, ఇద్దరు అన్నదమ్ములు తల్లి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నేరడిగొండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!