Friday, June 13, 2025

ఒకే సామాజిక వర్గం అందరూ బిసిలో కేటగిరీలో…. కానీ ఒక కుటుంబం మాత్రం ఎస్టీలో….

అదే ఎస్టీ సర్టిఫికెట్ అడ్డుపెట్టుకుని తప్పుడు పత్రాలతో పదుల ఎకరాల భూమిని కబ్జా చేసి దర్జాగా అమ్ముతున్నా వైనం ….

ఎవరన్న భూమి కొంటె ఎదో ఒక భూమిలో వివాదం ఉండవచ్చు … కానీ వీరు కొన్నట్లు సృష్టించిన 50 ఎకరాల భూములు సైతం వివాదాస్పద మైనవే …. ఆధారలతో సహా ప్రత్యేక కథనం….

సొంత అల్లుడు బిసిలో….. బంధు గణమంత బిసిలో ….

ఇచ్చోడ సర్పంచ్ కుటుంభం మాత్రం ఎస్టీలో …. మిగతా కుటుంబ సభ్యులు మాత్రం బిసిలో ……

సంచారాజాతి ఓడు తెగ అయిన తమను కేసీఆర్ సారు బిసిలో చేర్చెరు…. మాకు ఆనందంగా ఉంది…

రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్ / ఇచ్చోడ : ఆ సంచారాజాతి ఓడు కులస్తులరందరిని గతేడాది బిసి లో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా వారికి బిసిలో కలపడంతో తమకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయిని సామాజిక వర్గం వారు సొంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఇచ్చోడ ల గత ఎన్నో సార్లు సర్పంచ్ గా ఎంపిటిసి గా గెలుపొందుతూ వస్తున్నా కుటుంభం మాత్రం ఎస్టీ క్యాటగిరి లో కులం సరిటిఫికెట్ పొంది దర్జాగా పదవులు అనుభవిస్తున్నారు.

బిసిలో నమోదు చేసినందుకు కృతజ్ఞతగా ఎమ్మెల్యే జోగురామన్నా ను సన్మానిస్తున్నా ఓడ్ కులస్తులు

సొంత అల్లులు , మిగతా అన్నదమ్ములు బిసిలో ఉంటారు. కానీ ఆ సర్పంచ్ కుటుంభం మాత్రం ఎస్టీ లో ఉన్నారు. ఇది వినడానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం….

కొంతమంది ఎస్టీ కమ్యూనిటీ నాయకులను మంచిగా చేసుకుని ఆ వర్గం వారి పేరిట గత ఎన్నో ఏళ్ళు గా కులం సర్టిఫికేట్ పొందుతున్నారు. సొంత వారు అందరూ ఇన్ని రోజులు బిసి సర్టిఫికెట్ కోసం నానా తంటాలు పడే వారు , కానీ ఆ మాజీ వైస్ ఎంపిపి కుటుంభం మాత్రం ఏకంగా ఎస్టీ సర్టిఫికెట్ పొందడం ఆశ్చర్యం గా ఉంది. ఇచ్చోడలో చుట్టూ పక్కలా యాబై ఎకరాల భూమిని కూడా వారు అక్రమ మార్గం లో అనుభవిస్తున్నారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న భూమిని మరియు ఎవరు అందుబాటులో లేని వారి భూమిని డూప్లికేట్ పాత్రలు సృష్టించి కాస్తూ కాలంలో పేర్లు నమోదు చేసుకున్నారు. దీనికి అప్పటి తహశీల్దార్ పూర్తిగా సహకరించినట్లు సమాచారం.

అతను లంబాడా కాదు ఎస్టీ కులానికి చెందిన వాడు కాదు అని గతంలో లంబాడా నాయకులు సైతం ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి అధికారులు విచారణ సైతం చెప్పట్టి నివేదికను పై అధికారులకు పంపారు….. కానీ ఏం లాభం ఇప్పటి తీర్పు పెండింగ్ లో ఉంది. మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి తన కూతురి పేరిట ఎస్టీ లంబాడా కుల ధ్రువీకరణ పత్రం తీసుకుని సర్పంచ్ గా పోటీ చేశారు.

తమ కమ్యూనిటీ ని బిసి లో కలిపినందుకు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ను సన్మానిస్తున్నా దృశ్యం

పక్షం రోజుల క్రితం తమను బిసిలో కలిపినందుకు ఒక సంవత్సరం అయిన సందర్భంలో మంత్రులు ,ఎమ్మెల్యేలను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నమస్తే తెలంగాణ పత్రికలో దీని పై ఓ పెద్ద న్యూస్ కూడా రావడం జరిగింది.

తప్పుడు పాత్రలతో అనుభవిస్తున్న భూముల వివరాలు ఇలా ఉన్నాయి…..

ఇచ్చోడ శివారంలో ఎక్కడా కూడా అనాధ భూమి కనిపిస్తే చాలు దాన్ని ఆ నాయకుడు కైవసం చేసుకోవడం ఖాయం. ఇచ్చోడా సర్వే నెంబర్ లు వరుసగా లో భూముల ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేరిట కాస్తూ కాలంలో పెర్లు నమోదు చేసుకున్నాడు. నిజాం కాలం నాటి గులాం దస్తగిరి భూములు సైతం తన పేరున రాయించుకున్నాడు.

మీ సేవా పహాని

  • ఇచ్చోడ మండల గ్రామ శివరాం సర్వే నెంబర్ 37/ఉ లో 7 ఏకరాల భూమిని బిల్యా , తండ్రి . భోజ్యా కు చెందిన భూమిని చౌహన్ సయా బాయి భర్త దేవనంద్ ( ఇచ్చొడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ) పేరిట రాయించుకున్నాడు.
  • ఇచ్చోడ  మండల గ్రామ శివరాం సర్వే నెంబర్ 77 లో 5 ఏకరాల భూమిని  బిల్యా , తండ్రి . భోజ్యా  కు చెందిన భూమిని చౌహన్ సయా బాయి భర్త దేవనంద్ ( ఇచ్చొడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ) పేరిట రాయించుకున్నాడు.
  • ఇచ్చోడ  మండల గ్రామ శివరాం సర్వే నెంబర్ 37/ఉ లో 6.22 ఏకరాల భూమిని  బిల్యా , తండ్రి . భోజ్యా  కు చెందిన భూమిని చౌహన్ అశోక్ తండ్రి దేవానంద్ ( ఇచ్చొడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ) పేరిట రాయించుకున్నాడు.) ( పైగా కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు సృష్టించారు. )
  • ఇచ్చోడ  మండల గ్రామ శివరాం సర్వే నెంబర్ 120/ఇ లో 7.05 ఏకరాల భూమిని అసలు పట్టాదారు  లాల్ సింగ్ , తండ్రి . దామ్లా  కు చెందిన భూమిని చౌహన్ సయా బాయి  భర్త దేవానంద్ ( ఇచ్చొడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ) పేరిట రాయించుకున్నాడు.) ( పైగా కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు సృష్టించారు. )
  • సర్వే నెంబర్ 37/ ఈ పట్టేదారు తార్య s/o దామ్లా , పడవ భూమి ఉంది…
  • సర్వే నెంబర్ 120/అ లో 7.52 గు. ఏకరాల భూమిని అసలు పట్టాదారు  నిజామోద్దీన్ (గులాం దస్తగిరి) కు చెందిన భూమిని చౌహన్ సయా బాయి  భర్త దేవానంద్ ( ఇచ్చొడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ) పేరిట రాయించుకున్నాడు.) ( పైగా కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు సృష్టించారు. ) ( ఇది మరీ విచిత్రం ) ఈ భూమిని సైతం కొనుగోలు అని రాయించుకున్నాడు.
  • సర్వే నెంబర్ 120/అ3 లో 3.25 ఏకరాల భూమిని అసలు పట్టాదారు  తార్య s/o. దామ్లా   కు చెందిన భూమిని చౌహన్ సయా బాయి  భర్త దేవానంద్ ( ఇచ్చొడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ) పేరిట రాయించుకున్నాడు.) ( పైగా కొనుగోలు చేసినట్లు డాక్యుమెంట్లు సృష్టించారు. )   ( ఇది మరీ విచిత్రం )  ఈ భూమిని సైతం కొనుగోలు అని రాయించుకున్నాడు. ఒకపక్క పాత పట్టాదారు అనుభవ కాలంలో ఉండి పడవ అని ఉంది . అదే భూమిని మళ్ళీ వీరు ఎవరి వద్ద కొన్నారో చూస్తే ఆశ్చర్య పోతారు.

పై భూములు కొన్నట్లు రికార్డ్ అయితే సృష్టించారు, కానీ ఏ ఒక్క ఎకరం కూడా నేరుగా పట్టాదారు వద్ద కొన్నట్లు లేదు. ఈ భూములు చాలా కాలం పడవ గా ఉండడంతో వీటి పై ఆ కుటుంభం కన్నుపడింది. ఇంకేముంది అన్ని రాయించుకున్నాడు. దీనికి అప్పటి తహసీల్దార్ కూడా మంచిగానే ఈ విషయాన్ని మాములుగా తీసుకుని అతనికి పూర్తి స్థాయిలో సహకరించినట్లు సమాచారం.

కొన్నట్లు సృష్టించిన బాండ్ పేపర్

రెవెన్యూ రికార్డుల్లో ఎక్కించే ముందు తప్పుడు బాండ్ పేపర్లతో కొనుగోలు చేసినట్లు సృష్టించి ఆ తర్వాత నెమ్మదిగా రికార్డుల్లో నమోదు చేయించుకున్నారు.

ఉట్నూర్ ఎస్డీసి కోర్టులో కేసు నడుస్తున్నట్లు డాక్యుమెంట్లు…. ( నోటీస్ ) కానీ ఈ భూమి కేసు ఎవరు వేశారో ఎందుకు వేశారో తెలియదు. తరువాత వివాదం ఉన్న ఈ భూమిని సర్పంచ్ కుటుంబం తెలిసి కొనడం చూస్తే ఇది పక్క ప్లాన్ ప్రకారం చేసినట్లు గమనించ వచ్చు.

ఇలా ఆ వ్యక్తి పదవిలో ఉన్నన్ని రోజులు సుమారు యాబై ఎకరాల వరకు భూమిని తన కుటుంభం పేరిట రాయించుకున్నాడు. దీనికి గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ సహాయం చేసినట్లు వినికిడి.

ఎక్కడ ఖాళీ ప్లాటు కనిపించిన మండలం లో అక్కడ ఆ కుటుంభం వాలిపోతుంది. గతంలో కూడా ఎన్నో చోట్ల ఇలా డబులు నొక్కేశారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి