వరకట్న వేధింపుల కేసులో నలుగురికి జైలు శిక్ష మరియు జరిమానా విధించిన ప్రధమ శ్రేణి న్యాయమూర్తి పిసిఆర్ కోర్టు జడ్జ్ యశ్వంత్ సింగ్ చౌహన్
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ -క్రైం : ప్రధమ శ్రేణి న్యాయమూర్తి పిసిఆర్ కోర్టు జడ్జ్ యశ్వంత్ సింగ్ చౌహన్ వరకట్న వేధింపుల కేసులో నలుగురికి జైలు శిక్ష మరియు జరిమానా విధించారు.
వివరాలలోకీ వెళితే…. 2015 వ సంవత్సరం ఆదిలాబాద్ లోని ఆర్టీసీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న ఫరానా బేగం (30) ఇచ్చోడకు చెందిన షేక్ మొయినుద్దీన్ (36) అని వ్యక్తితో పెళ్లి చేసుకుని సంసారం చేస్తుండగా, ఆమెను తన భర్త షేక్ మొయినుద్దీన్, అతని చెల్లి అసిమా, అన్న షేక్ జమాలుద్దీన్, వదిన షేక్ గౌసియా అనే వారు ఆమెకు పిల్లలు కాలేదని మానసికంగా, శారీరకంగా వేధిస్తూ అదనపు వరకట్నం తీసుకురావాలని వేధించి ఇంట్లో నుండి వెళ్ళగొట్టగా, ఆమె దరఖాస్తు మేరకు ఎస్సై డి పద్మ మహిళా పోలీస్ స్టేషన్ ఆదిలాబాద్ కు సంబంధించిన క్రైమ్ నంబర్ 37/2015 U/Sec 498(a)IPC, 4 OF డౌరీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు నివేదికను కోర్టులో సమర్పించినారు.
ఇట్టి కేసులో సిడిఓ కాజా అబ్దుల్ మొబిన్ సాక్షులను కోర్టు యందు ప్రవేశపెట్టగా అసిస్టెంట్ పీపీ ఎం నవీన్ నేరం రుజువు చేయగా ప్రథమ శ్రేణి న్యాయమూర్తి పిసిఆర్ కోర్ట్ జడ్జ్ యశ్వంత్ సింగ్ చౌహన్ తీర్పు వెలువరిస్తూ నిందితులు నలుగురికి ఒక సంవత్సరం సాధారణ జైలు శిక్ష మరియు రూపాయలు ఐదువేలు జరిమానా ఒక్కొక్కరికి, జరిమానా మొత్తం రూ.20,000ల విధించారు. ఈ జరిమానా మొత్తం బాధితురాలికి ఇవ్వవలసిందిగా ఆదేశించారని కోర్టు లైసెన్ అధికారి ఎం గంగాసింగ్ తెలిపారు.