republichindustan.in
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 9:34 am Digital Edition : REPUBLIC HINDUSTAN

సిబ్బంది విధులను క్రమశిక్షణతో నిర్వహించాలి

  • సిబ్బంది ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
  • విధులలో చెడు వ్యసనాల ను కలిగి ఉండరాదు.
  • అనవసరంగా తెలియని వ్యక్తులకు పూచికత్తు (షూరిటీ) ఇవ్వకుండా ఉండటం మంచిది.
  • వయసు పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా యోగ సాధన
  • క్రమశిక్షణ ఉల్లంఘన జరిగితే శాఖపరమైన చర్యలు

– – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్

ఆదిలాబాద్:  సిబ్బంది విధులను నిర్వర్తించే క్రమంలో క్రమశిక్షణతో ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలియజేశారు. ప్రతి శనివారం రోజున స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు సిబ్బంది ప్రతి ఒక్కరికి పరేడ్ నిర్వహించబడుతుందని, పరేడ్ వల్ల సిబ్బంది ఒకరి మధ్య ఒకరికి మధ్య సత్సంబంధాలు మెరుగుపడతాయని, అదేవిధంగా సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలని తెలిపారు.

Thank you for reading this post, don't forget to subscribe!

పరేడ్లో మొదటగా రిజర్వ్ ఇన్స్పెక్టర్ టి మురళి జిల్లా ఎస్పీకి గౌరవ వందనాన్ని సమర్పించి ఏడు ప్లాటూన్ లతో కూడిన పరేడ్లో విడతలవారీగా ప్రత్యేక గౌరవ వందన సమర్పించారు. తదుపరి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పరేడ్ వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తూ, సిబ్బంది విధులలో చెడు వ్యసనాలను సేవించకుండా ఉండాలని సూచించారు.

పోలీసు వ్యవస్థకు క్రమశిక్షణ తప్పనిసరిని క్రమశిక్షణ ఉల్లంఘన జరిగితే శాఖపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. సిబ్బంది చేసిన పరేడ్ మరింత ఉత్సాహంగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా ఇతరుల ఇతర వ్యక్తులకు తెలియని వ్యక్తులకు పూచికత్తులు (షూరిటీ) ఇవ్వకుండా ఉండాలని తెలిపారు. 50 ఏళ్లు పైబడిన సిబ్బందికి ప్రత్యేకంగా పరేడ్కు బదులు యోగ శిక్షణను అందించడం జరిగింది. పరేడ్లో భాగంగా సిబ్బంది అందరికీ ఆయుధాలపై మరియు వాటి వినియోగంపై, ట్రాఫిక్ సిబ్బందికి సిగ్నల్స్ పై శిక్షణ అందించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్ రావు, డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు బి సునీల్ కుమార్, సిహెచ్ కరుణాకర్, కే ఫణి ధర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు టి మురళి, బి శ్రీపాల్, ఎన్ చంద్రశేఖర్, ఎస్ఐ మావల వి విష్ణువర్ధన్, రిజర్వ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.