Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ :
ఇచ్చోడ మండలంలోని గిరిజన గ్రామాల్లో దండారి ఉత్సవాల సంబరాలు ప్రారంభమయ్యాయి. బాదిగూడ గ్రామంలో గోండులకు ఆరాధ్యదైవమైన ఏత్మసుర్ దేవతలకు బాదిగుడా తదితర గిరిజన గ్రామాల్లో ఆదివాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో గ్రామ పటేల్ లు భక్తులు ప్రత్యేకమైన పూజలు చేశారు. వాయిద్యాల చప్పుళ్లతో గళ్ళు గళ్ళుమనే గజ్జల చప్పుల మధ్య సాగుతున్న కోలాహాలంతో గిరిజన గూడాలు సందడిగా మారాయి. దండారి బృందాలు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లి అక్కడి వారితో కలిసి ఆటపాటలతో వినోదాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిడాం లక్ష్మీకాంత్, పెందుర్ బండు,మహజన్ పెందుర్ యదోరావ్, సర్పంచ్ మేస్రం కౌసల్య (అమృత్ రావ్) పెందుర్ లక్ష్మిణ్,కనక లక్ష్మణ్, ఆత్రం రమేష్, సిడాం.రాజేష్ పుసం తులిసిరాం, కనక జ్యోతిరాం, యుత్ అద్యక్షుడు పెందుర్ అశోక్, ఉప అద్యక్షుడు సిడాం మదుకార్, సిడాం రాజేందర్ టీచర్, తదితర గ్రామ పటేల్ లు, దేవరి లు, మహజన్ లు, యుత్ సభ్యులు పాల్గొన్నారు.
