Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : మండలం లోని నర్సాపూర్ గ్రామానికి చెందిన ముస్లే సాక్షి (16) అనే బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి కారణం సమీప బంధువు ప్రేమ పేరుతో వేధింపులే కారణమని సైబర్ క్రైం పోలీసుల విచారణలో తెలినట్లు ఎస్సై పి ఉదయ్ కుమార్ తెలిపారు.
ఆరు నెలల క్రితం ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన సాక్షి ముస్లే పురుగుల మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును సైబర్ క్రైం బ్రాంచ్ కి అప్పగించారు. ఇన్స్టాగ్రామ్ , ఫేస్ బుక్ ఆఫీస్ లకు కారణమైన వారి గురించి విచారణ చేపట్టారు.
విచారణలో ముస్లే సాక్షి మహారాష్ట్ర రాష్ట్రంలో ని డచ్ పూర్ కిన్వట్ కి చెందిన సమీప బంధువు దహిపాలే కృష్ణం రాజ్ (21) ఉన్నట్లు తేలడంతో అతన్నీ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఎస్సై తెలిపారు. సదరు బాలిక అతని ప్రేమను అంగీకరించకపోవడంతో నే నిందితుడు ఆమె పేరిట ఫెక్ ఐడి తయారు చేసి వేదించినట్లు తెలిపారు.
పిల్లలు ఫోన్ లు ఉపయోగించేటప్పుడు తల్లిదండ్రులు కూడా వారి పై దృష్టి సారించాలని ఎస్సై పి ఉదయ్ కుమార్ సూచించారు. సామాజిక మాధ్యమాలతో మంచి తో పాటు చెడు కూడా జరిగే అవకాశం ఉందని అన్నారు. ఏప్పుడు తెలియని వారితో వ్యక్తిగత ఫొటోలు గాని ఏ ఇతర విషయాలు పంచుకోకపోవడమే ఉత్తమమని అన్నారు.