ఎల్ సి తీసుకున్న విద్యుత్ సరఫరా చేసేసిన ఆపరేటర్…
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందూస్థాన్, ఇచ్చొడ : విద్యుత్ శాఖ ఆపరేటర్ నిర్లక్ష్యం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న డైలీ వెజ్ సంతోష్ పాలిట శాపంగా మారింది. ఇచ్చోడ మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామంలో విద్యుత్ లైన్ సరిచేయడానికి వెళ్లిన పాముల సంతోష్ ఇచ్చొడా విద్యుత్ శాఖ కేంద్రం నుండి ఎల్ సి తీసుకున్నాడు. స్థంభం ఎక్కి విద్యుత్ వైర్లు సరిచేస్తున్నా క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరిగి పాముల సంతోష్ విద్యుత్ఘాతం జరిగి అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత గ్రామస్తులు ఎలాగోలా తాడుతో కట్టి సంతోష్ చేంజ్ కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. సంతోష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఎల్ సి తీసుకున్న ఆపరేట్ షేక్ వలి విధుల పట్ల నిర్లక్ష్యం గా వ్యవహరించినట్లు స్థానికులు తెలిపారు.
గతంలో కూడా ఇలాగే ఓక డైలీ వెజ్ లైన్ మెన్ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇచ్చొడా లో చనిపోయిన విషయం తెల్సిందే.
