జీవితం  పై విరక్తి చెంది ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

రిపబ్లిక్ హిందుస్థాన్, సిరికొండ : మద్యానికి బానిసయి , మద్యం మానలేక జీవితం పై విరక్తి చెంది పిట్లే వాడ్ మాధవ్  (40) అనే వ్యక్తి తన స్వంత వ్యవసాయ క్షేత్రం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు మరియు మృతుని  కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం పిట్లే వాడ్ మాధవ్  ఎలాంటి వ్యవసాయ పనులు చేయకుండా ప్రతి రోజు మద్యం తాగి ఇంట్లో గోడవపడే వాడు.

ఇదే విషయం లో మృతుని  భార్య పిట్లే వాడ్ బాలిక మద్యం సేవించవద్దని చెప్పింది. దింతో అసహనానికి గురైన మాధవ్  తన స్వంతా వ్యవసాయ క్షేత్రానికి కోపంలో వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. పొరుగున ఉన్న మల్లేష్ అనే వ్యక్తి ఊరేసుకుని ఉన్న దృశ్యాన్ని చూసి గ్రామం సర్పంచ్ కు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చేనులో వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకుని వేలాడుతూన్నా మాధవ్ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

మద్యం  తాగడం మానివేయలేక , జీవితం పై విరక్తి చెంది ఆత్మహత్య కు పాల్పడినట్లు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏ ఎస్సై రాథోడ్ ప్రకాష్ తెలిపారు.