సెలూన్ షాప్ ఓనర్ ను కొట్టి చంపినా మృతుని బంధువులు
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, వేబ్ డెస్క్ : మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా కిన్వాట్ తాలుక బోధిది గ్రామంలో జరిగిన హత్యాలతో ఒక్కసారిగా కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓ సెలూన్ షాప్ లో గడ్డం గీయించుకునేందుకు వచ్చిన యువకుడిని సెలూన్ నిర్వాహకుడు సెలూన్ కత్తితో గడ్డం గిస్తున్నట్లు నటించి గొంతు కోసి నరికి చంపగా, ప్రతీకారంగా ఆ యువకుడి బంధువులు సెలూన్ నిర్వాహకుడిని చితకబాది చంపేసిన ఘటన జరిగింది. ఈ ఘటన నాందేడ్ జిల్లాలోని బోధిడి లో చోటుచేసుకుంది. కిన్వాట్ తాలుక బోధిడి గ్రామంలో అనిల్ షిండేకి సెలూన్ ఉంది. సాయంత్రం గ్రామానికి చెందిన వెంకట్ దేవకర్ అనే 22 ఏళ్ల యువకుడు ఈ సెలూన్‌లో షేవింగ్ చేసుకునేందుకు వచ్చాడు. గడ్డం గిస్తున్నట్లు నటించిన అనిల్ షిండే యువకుడి పీక కోసి చంపేశాడు. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఉండడంతో పోలీసులు భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు.