◾️ఇచ్చోడ మండల కేశవపట్నం గ్రామంలో ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో తనిఖీలు…
◾️ ప్రజలందరు తమ చుట్టూ జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలపాల గురించి వెంటనే పోలీసులకు తెలియచేయాలి : ఏఎస్పీ
◾️ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 26 బైకులు, విలువైన 110 టేకు కలప దుంగలు స్వాధీనం….Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, ఇచ్చోడ : ఇచ్చోడా మండలంలోని బుధవారం రోజు తెల్లవారుజామున కేశవపట్నం గ్రామం లో ఉట్నూర్ ఏఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసు సిబ్బంది కేశవపట్నంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ను చేపట్టారు.
ఈ సందర్బంగా ఉట్నూర్ సబ్ డివిజన్ ఏఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ అదిలాబాదు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, ఉట్నూర్ సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో కలిసి ఇచ్చోడ మండలం లోని కేశవ పట్నం గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయటం జరిగిందని తెలిపారు . ఈ సందర్బంగా చేపట్టిన తనిఖీలలో భాగంగా భాగంగా ఎలాంటి పత్రాలు లేని 26 మోటార్ సైకిల్ లను మరియు సుమారు ఒక లక్ష విలువగల 110 అక్రమ టేకు దుంగలను స్వాదినపర్చుకోవడం జరిగిందని తెలిపారు.
పట్టుబడిన అక్రమ కలపను తదుపరి చర్యల కోసం అటవీశాఖ అధికారులకు అప్పగించటం జరిగిందని తెలియజేశారు. ఉట్నూర్ సబ్ డివిజన్ లో ప్రతి మండలంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు అందరూ తమ గ్రామంలో తమ చుట్టూ జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలపాల గురించి వెంటనే పోలీసులకు తెలియజేయాలనీ, వాహన దారులు విధిగా సరైన వాహన పత్రాలు కలిగి ఉండాలని, ఎవరైనా చట్టానికి విరుద్దంగా కలప అక్రమ రవాణా చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకొనబడుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఇచ్చోడా మరియు నార్నూర్ సిఐలు ఎం నైలు, ప్రేమ్ కుమార్, ఇచ్చోడా ఎస్ఐ ఉదయ్ కుమార్, నేరడిగొండ ఎస్సై మహేందర్, బోథ్ ఎస్ఐ రవీందర్, బజార్ హత్నర్ ఎస్ఐ ముజాహిద్, ఆదిలాబాద్ టూ టౌన్ ఎస్ఐ నాగనాత్, గాదిగూడ ఎస్ఐ ఇమ్రాన్, మరియు సబ్ డివిజన్ లోని 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.