Riyad , Andhra : సౌదీ అరేబియాలోని రియాద్ నగరంలో NRI TDP టీం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రధాన కార్యక్రమంలో చిన్నారుల చేతుల మీదుగా కేక్ కట్ చేయించి సంబరాలు జరిపారు. కార్యక్రమానికి తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), మహేంద్ర వాకాటి, మోహన్ గురజాల, శివ దబ్బకూటి, ఖాదర్ షేక్, హరీష్, మణికంఠ, రవి మేడూరి, ప్రవీణ్ పోకూరి, వంశీ, రామ్ మద్దుకూరి తదితరులు హాజరయ్యారు.
P4 స్పూర్తితో సేవలకు గుర్తింపు
ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక అయిన P4 స్ఫూర్తితో తాను నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు గాను ప్రకాశం జిల్లా స్థాయిలో “ఉత్తమ మార్గదర్శి”గా ఎంపిక కావడం ఆనందకరమని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు గారి చేతుల మీదుగా సన్మానం పొందడం, జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి గారి నుండి ప్రశంసా పత్రం అందుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు.
అభివృద్ధిపై నేతల ఆశాభావం
మహేంద్ర, శివ, మోహన్, ఖాదర్ షేక్ తదితరులు మాట్లాడుతూ, నవ్యాంధ్రప్రదేశ్ మరియు రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడాలంటే చంద్రబాబు నాయుడు గారు మరికొన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు.
కుర్ధుబా ప్రాంతంలో కార్మికులతో వేడుకలు
రియాద్ వెలుపల కుర్ధుబా ప్రాంతంలో రాఘవేంద్ర చౌదరి N ఆధ్వర్యంలో గృహనిర్మాణ కార్మికుల సమక్షంలో కూడా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం బొల్లం, అంజి కేతా, అజ్మతుల్లాహ్ షేక్, పల్లివెళ్ళి వెంకటేశ్వరరావు, నేమాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
APNRTS సేవలపై ప్రశంసలు
విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులకు APNRTS ద్వారా అందుతున్న ఇన్సూరెన్స్ సదుపాయం ఎంతో భరోసానిస్తోందని రాఘవేంద్ర చౌదరి కొనియాడారు.
మే 2026లో మినీ మహానాడు
కార్యక్రమం ముగింపులో, వచ్చే మే 2026లో నిర్వహించనున్న “మినీ మహానాడు”ను విజయవంతం చేయాలని NRI TDP, Saudi Arabia టీం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.