నిర్మల్ జిల్లా కేంద్రంలో KCR దిష్టి బొమ్మ దహనం చేస్తున్న టీజేఎస్ నాయకులను అడ్డుకున్న పోలీసులు
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందుస్థాన్, నిర్మల్ :
కేంద్ర ప్రభుత్వం 15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా పంచాయితీలకు కేటాయించిన 35,000 వేల కోట్ల రూపాయల నిధులను కేసీఆర్ ప్రభుత్వం దొంగిలించాడన్ని నిరసిస్తూ, కేసీఆర్ మీద దొంగతనం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో టీజేఎస్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఇంచార్జీ కంతి మోహన్ రెడ్డి, టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, టీజేఎస్ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జీ సర్దార్ వినోద్ కుమార్ టీజేఎస్ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్షులు తిలక్ రావు, అడే సునీల్, నాయకులు వినయక్ దిలీపు, కంతి రమేష్, ప్రసాద్, విలాస్, రాష్ట్ర పాల్, మనిష్, ప్రవీన్, కృష్ణ, రామ్, కిరణ్ కుమార్ రెడ్డి, అనిల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
