🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 23 September 2026, 9:10 pm Posted by : HINDUSTAN

ఆయుర్వేదిక్ మందులు సంపూర్ణ ఆరోగ్యానికి ఆయువు వంటివి

News Image
కొణిజర్ల ప్రభుత్వ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో 11వ ఆయుర్వేద దినోత్సవన్నీ పురస్కరించుకొని ఈ రోజు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయుర్వేదిక్ డాక్టర్ అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ ఈ క్యాంప్ యొక్క ఉద్దేశ్యమును వివరిస్తూ ధన్వంతరి మహర్షి జయంతి సందర్భంగా వేద కాలం నుంచి వస్తున్న అనేక ఔషధ గుణాలు కలిగిన ఆయుర్వేదిక మందులు అన్ని వయసుల వాళ్ళకి అనేక రోగాల నుంచి దూరం చేస్తుందని చెప్పారు. ఈ మందులు వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ గాని ఉండవని చెప్పారు మనం నిత్యం వాడటం వల్ల వ్యాధినిర్వశక్తి పెరుగుతుంది ఎలాంటి జబ్బులు నైనా ముందస్తుగా శరీరంలో రాకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది. కొనిజర్ల ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు ప్రతిరోజు మందులు ఉచితంగా ఇస్తామని చెప్పారు. దీన్ని గ్రామ ప్రజలందరూ తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 164 మంది కీ పరీక్షించి మందులు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొణిజర్ల గ్రామ సర్పంచ్ గుడే పుష్పావతి, మెడికల్ ఆఫీసర్ శారద,సిహెచ్ఓ దుర్గా మల్లేశ్వరి ఫార్మసిస్టు కల్పన,యోగ ఇంస్ట్రుక్షర్స్ నాగేశ్వరరావు,సంధ్యారాణి స్టాఫ్ నర్స్ రజిని, ఆశా వర్కర్లు అంగనవాడి టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home