దండంపల్లిలో స్కంద లైఫ్‌లైన్ హాస్పిటల్ మెగా హెల్త్ క్యాంప్
నల్గొండ రూరల్ సెప్టెంబర్ 20 నేటి వెలుగు ప్రతినిధి: దండంపల్లి గ్రామంలో స్కంద లైఫ్‌లైన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్‌కు విశేష స్పందన లభించింది. చత్రపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో ఫెర్టిలిటీ నిపుణురాలు డాక్టర్ రాగ మాలికాదేవి, జనరల్ మెడిసిన్ డాక్టర్ మణికంఠ, జనరల్ సర్జన్ డాక్టర్ రూపేష్, చర్మవ్యాధుల నిపుణురాలు డాక్టర్ భవ్య బాలిని పాల్గొని సుమారు 100 మంది ఓపీ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ సందర్భంగా **ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.** అలాగే ఈరోజు నుంచి మూడు రోజుల పాటు హాస్పిటల్‌లో **ఉచిత ఓపీ సేవలు** అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా వివిధ వైద్య పరీక్షలపై 50 శాతం వరకు రాయితీ అందిస్తున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బుచ్చిరాజు, మాజీ సర్పంచ్ వెంకన్న, యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్ కుమార్, వార్డు మెంబర్ నరేష్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ వైద్య సేవలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ బుచ్చిరాజు కోరారు.