🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 05 June 2026, 2:43 pm Posted by : HINDUSTAN

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: జిల్లా కలెక్టర్ రాజర్షిషా*

News Image

పత్రికా ప్రకటన
జూన్ 5, 2026_ఆదిలాబా

[contact-form][contact-field label="Name" type="name" required="true" /][contact-field label="Email" type="email" required="true" /][contact-field label="Website" type="url" /][contact-field label="Message" type="textarea" /][/contact-form]

*పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మన వంతు భాగస్వామ్యం అందించాలి:ఎస్పీ అఖిల్ మహాజన్*

మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదుర్కోవడానికి అడవులను రక్షించుకోవడం ఒక్కటే మార్గమని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పిలుపునిచ్చారు. "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" లో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆదిలాబాదు గ్రామీణ మండలం యాపల్‌గూడ బీట్‌లో
అడవుల పునరుజ్జీవనం కోసం సరికొత్త హై డెన్సిటీ మిక్స్డ్ ప్లాంటేషన్ విధానంలో భారీగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించబడింది. ఈ బృహత్తర కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ లతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రపంచ పర్యావరణ పరిరక్షణ, అడవుల విస్తీర్ణం పెంపుదలే ధ్యేయంగా ప్రభుత్వం అటవీ శాఖ ఆధ్వర్యంలో విస్తృతం అవగాహన కల్పిస్తూ సంరక్షిస్తుందని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను ఎదుర్కోవడానికి అడవులను రక్షించుకోవడం ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం - ప్రగతికి ప్రణాళిక” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని వృక్షాలుగా మార్చే వరకు సంరక్షించడం అంతకంటే ముఖ్యమని, నాటిన ప్రతి మొక్కను బ్రతికించుకునేలా అధికారులు, ప్రజలు సమిష్టిగా బాధ్యత తీసుకోవాలని సూచించారు.

అనంతరం జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. పాస్టిక్ వినియోగాన్ని తగ్గించి తమ వంతు బాధ్యత గా మెలగని సూచించారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే మానవాళి మనుగడకే ప్రమాదమని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పచ్చని వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు. పోలీస్ శాఖ తరఫున జిల్లా వ్యాప్తంగా మొక్కల పెంపకానికి, అడవుల రక్షణకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ హరిత సంకల్పం విజయవంతం అవుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, ఆదిలాబాదు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ నిరోష, డిఎస్పీ జీవన్ రెడ్డి, ఎఫ్డిఓ అరవింద్, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు. విద్యార్థులు, అటవీ, పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home