🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 May 2026, 9:33 am Posted by : HINDUSTAN

జుబైల్‌లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం

News Image

📰 జుబైల్‌లో ఘనంగా BBN మీట్ & గ్రీట్ కార్యక్రమం

Saudia Arabia : సౌదీ అరేబియాలోని జుబైల్ నగరంలో భారత్ బిజినెస్ నెట్‌వర్క్ (BBN) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ & గ్రీట్ కార్యక్రమం ఘన విజయాన్ని సాధించిందని సాటా వ్యవస్థాపక అధ్యక్షులు MalleSan.com తెలియచేశారు. ఈ కార్యక్రమానికి ప్రొఫెషనల్స్, వ్యాపారవేత్తలు మరియు భారతీయ కమ్యూనిటీ సభ్యులు భారీగా హాజరై, ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు.

ఈ సమావేశం పరస్పర పరిచయాలను పెంపొందించుకోవడం, వ్యాపార అవకాశాలపై చర్చించడం, అలాగే కమ్యూనిటీ అభివృద్ధి కోసం సహకారాన్ని బలోపేతం చేయడం వంటి ముఖ్య లక్ష్యాలతో నిర్వహించబడింది. పాల్గొన్న వారు సానుకూల దృక్పథంతో తమ ఆలోచనలు పంచుకోవడం ద్వారా ఈ కార్యక్రమం మరింత సార్థకంగా మారింది.

కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించిన వారిలో ముంబై కి చెందిన GIO జుబైల్ అధ్యక్షురాలు శ్రీమతి రోష్నా సాత్రే గారు వేదికను ఏర్పాటు చేయడం ద్వారా ప్రత్యేకంగా నిలిచారు. అలాగే GWAC కమ్యూనిటీ నాయకుడు ఖలీల్ గారు, SATA ప్రతినిధి తరక్ గారు, దివాకర్ గారు తమ విలువైన సహకారం అందించారు.

BBN వాలంటీర్లు అర్వింద్ గారు, షౌకత్ గారు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించగా, GISA అధ్యక్షుడు అనిల్ మల్పాని గారు, SATA ER అధ్యక్షుడు తేజ గారు, SATA CR రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్, GIO HAIL ఎంబసి Coordinator, కేరళ కు చెందిన చంసా రాహామన్, కోబర్ కు చెందిన మణికట్టన్ మరియు ఇతర కమ్యూనిటీ నాయకులు తమ ప్రోత్సాహం అందించారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రాంతీయ పరిమితులను దాటి సహకారం, వ్యాపార అవకాశాలు మరియు పరస్పర అభివృద్ధి లక్ష్యాలతో ఒక బలమైన నెట్‌వర్క్ నిర్మాణానికి బాటలు వేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో మరింత విస్తృతంగా నిర్వహించి, భారతీయ సమాజాన్ని మరింతగా ఏకతాటిపైకి తీసుకురావాలని, మే 9నరియాద్ జరిగబోయే భారత్ ప్రొఫెషనల్ మీట్ కు సన్నాహాలు చేస్తున్నామని BBN నిర్వాహకులు రిపబ్లిక్ ప్రతినిధి కు తెలియచేశారు🚀.


























🏠 Home