🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 April 2026, 7:08 pm Posted by : HINDUSTAN

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తా-కలెక్టర్ రాజర్షి షా

News Image


వినతి పత్రాన్ని అందజేసిన టీ.ఎస్.జె యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల్ అనిల్  కుమార్ జిల్లా నాయకులు

అదిలాబాద్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

అదిలాబాద్ జిల్లా , రిపబ్లిక్ హిందుస్థాన్ : తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీ.ఎస్.జె.యు) జిల్లా నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ కార్యాలయంలో కలెక్టర్ రాజర్షి షా నీ మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్నీ అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  నూతనంగా ఎన్నుకొబడిన జిల్లా అధ్యక్షుడు రాగం సుభాష్ ,ప్రధాన కార్యదర్శి మేడపట్ల సాయన్న, ఉపాధ్యక్షులు పసుపుల స్వామి లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు జర్నలిస్టు లు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా అర్హులైన జర్నలిస్టుల అందరికీ అక్రిడేషన్ కార్డులను మంజూరు చేయడం తోపాటు హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు ఆసుపత్రులలో చెల్లుబాటు అయ్యేవిధంగా చూడాలని, అర్హులైన జర్నలిస్టుల అందరికీ ఇల్లు,ఇంటి స్థలాలు ఇవ్వవలసిందిగా కోరారు.దీనిలో భాగంగా జర్నలిస్టులపై దాడులు జరుగుతున్న సందర్భంలో అటాక్స్ కమిటీని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసి రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామని వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తాను అని బరోసా ఇచ్చారు. యూనియన్ కోశాధికారి అమృత్, ఓకే ప్రచార కార్యదర్శి మిలింద్, యూనియన్ గౌరవ అధ్యక్షులు నరేష్ కదం, సహాయ కార్యదర్శి ఆర్క సంతోష్ తో పాటు మిగతా సభ్యులు దీపక్ ఎముర్లవార్, అనిల్ పవర్, అడ్డిగం మోహన్, శంకర్ తదితరులు ఉన్నారు.

🏠 Home