🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 04 November 2025, 11:06 am Posted by : HINDUSTAN

Gold Price: ఊహించని మార్పు.. నేటి బంగారం ధరలు ఇవే

News Image




హైదరాబాద్, నవంబర్‌ 4 :  పసిడి ప్రియులకు మరోసారి షాక్‌ ఎదురైంది. గత రెండు రోజులుగా ఊరట కలిగించిన బంగారం ధరల్లో ఇవాళ ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. అంతకు ముందు భారీగా తగ్గి స్థిరంగా కొనసాగిన పసిడి రేట్లు మంగళవారం మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో నవంబర్‌ 4వ తేదీన హైదరాబాద్‌ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం రేట్లు ఎంత ఉన్నాయో చూద్దాం.





బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఎప్పటికప్పుడు ధరలు తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బులియన్‌ మార్కెట్లో ధరలు రోజు రోజుకు మారుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో పసిడి రేట్లు ఊహించని విధంగా మారిపోతున్నాయి. ఈ 2025 సంవత్సరంలో బంగారం ధరలు ఇప్పటికే 50 శాతం మేర పెరిగాయి. కొత్త గరిష్ఠాలను తాకిన తర్వాత మళ్లీ కొంత వెనక్కి వచ్చాయి. దీంతో కొనుగోలుదారులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు.
అంతర్జాతీయ రాజకీయాలు, వాణిజ్య అంశాలు, అమెరికా సుంకాలు, ఫెడ్‌ నిర్ణయాలు, దేశీయ గిరాకీ – ఇవన్నీ బంగారం ధరలపై నేరుగా ప్రభావం చూపిస్తుంటాయి. రెండు రోజుల క్రితం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గి ఊరట కలిగించగా, ఆ తర్వాత రోజు మార్పులేకుండా కొనసాగాయి. ఇక ధర తగ్గుతుందనుకున్న సమయానికే ఇవాళ ధరలు మళ్లీ ఎగబాకాయి.





హైదరాబాద్‌లో బంగారం రేట్లు
హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో రెండు రోజుల తర్వాత పసిడి ధరలు పెరిగాయి. ఆదివారం భారీగా తగ్గిన ధరలు సోమవారం స్థిరంగా ఉండగా, మంగళవారం ఉదయం ఒక్కసారిగా పెరిగాయి.


24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – రూ. 1,23,170 (రూ.170 పెరుగుదల)


22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) – రూ. 1,12,900 (రూ.150 పెరుగుదల)


వెండి ధరల్లో భారీ ఎగబాకుడు
వెండి రేట్లు కూడా ఒక్కరోజులో భారీగా పెరిగాయి. గత వారం నుంచి తగ్గుతూ వచ్చిన వెండి ఇవాళ ఒక్కసారిగా రూ.2,000 మేర పెరిగింది.


హైదరాబాద్‌లో వెండి ధర (కిలో) – రూ. 1,68,000
ఇక బెంగళూరు, పుణే, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కిలో వెండి రేటు సుమారు రూ. 1,54,000 వద్ద ఉంది.


అంతర్జాతీయ మార్కెట్లో పరిస్థితి
అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు కాస్త తగ్గాయి. స్పాట్‌ గోల్డ్‌ ధర ఔన్సుకు 16 డాలర్ల మేర పడిపోగా, ఇది రూ. 3,986 వద్దకు దిగివచ్చింది. స్పాట్‌ సిల్వర్‌ ధర కూడా 1.48 శాతం తగ్గి రూ. 47.97 వద్దకు చేరింది.
పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు నవంబర్‌ 4వ తేదీ మంగళవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్నవి. మధ్యాహ్నానికి రేట్లు మారే అవకాశం ఉన్నందున, కొనుగోలు చేసే ముందు తాజా ధరలు తెలుసుకోవడం మంచిది.

🏠 Home