🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 18 May 2025, 10:00 pm Posted by : HINDUSTAN

వీడీసీ నిర్వాహకులపై కేసు నమోదు


ఆదిలాబాద్, రిపబ్లిక్ హిందుస్థాన్: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకొలి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాప్ మరియు తెల్ల కల్లు దుకాణం నిర్వహించుటకు VDC విలేజ్ డెవలప్మెంట్ కమిటీ పేరుతో 1. కనక రమణయ్య 2. ఎర్రం ప్రభాకర్ 3. ఎర్రం అశోక్, 4. ఇటికల భూమన్న మరియు ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి ఒక ముఠాగా ఏర్పడి నిబంధనలకు విరుద్ధంగా వేలంపాట నిర్వహించి కల్లు దుకాణం కు మూడు లక్షలు మరియు బెల్ షాప్ నడుపుకోవడానికి 3 లక్షల 90 వేలు వేలంపాట పెట్టినారు అట్టి వేలంపాటలో అదే గ్రామానికి చెందిన గోపు రామన్న పాడుకోవడం జరిగింది. ఇట్టి సంఘటనపై VDC విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా సరే నిబంధన విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా లేదా ప్రోత్సహహించినా వారిపైన కేసులు పెట్టి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

🏠 Home