🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 February 2025, 3:51 pm Posted by : HINDUSTAN

తిరుమల తిరుపతిలో దంపతుల ఆత్మహత్య?

News Image

తిరుపతి :  జిల్లాలో దైవ దర్శానికి వచ్చి దంపతుల ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది.. శ్రీవారి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు (60), ఆయన భార్య అరుణ (55) తిరుమల శ్రీవారి దర్శానికి వచ్చారు. నందకం అతిథి గృహంలోని గది నెంబర్ 203ను అద్దెకు తీసుకున్నారు. అయితే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.?

ఈ ఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వచ్చి కాటేజీలో ఆత్మహత్య చేసుకోవటం, అందులోనూ భార్యాభర్తలు ఇలా తిరుమలలో చనిపోవాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకూని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్య సమాచారాన్ని తిరుపతిలో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.
పిల్లలు, బంధువులు కొండకు వచ్చి పోలీసుల విచారణకు హాజరయ్యారు.

🏠 Home