🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 28 August 2024, 4:14 pm Posted by : HINDUSTAN

నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో సహా ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

News Image


గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో గతంలో కేసు నమోదు
జిల్లా పోలీస్ కార్యాలయంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్

రాజన్న సిరిసిల్ల : నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు ముగ్గురు వ్యక్తులను పోలీసు   అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి...

జిల్లాలోని గంబిరావు పేట పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గంజీసింగవరం గ్రామానికి చెందిన 1. రాయలింగు శంకర్ (50) ,  2. రాయలింగం చంద్రమౌళి (40), 3.శత్రవేణి హరీష్ (27),  4.లోకిడ్ గంగయ్య (45) లను నాటు తుపాకీ తయారీ కేసులో అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

       వివరాలు .... గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి వాటిని అదే గ్రామానికి చెందిన అడవి జంతువులను వేటాడే వారికి అమ్ముతున్నాడన్నా నమ్మదగిన సమాచారం రాగా గంభీరావుపేట ఎస్.ఐ ఈరోజు తన సిబ్బందిని తీసుకొని గజసింగవరం గ్రామంలోని రాయలింగు శంకర్ ఇంటికి వెళ్ళగా అక్కడ రాయలింగు శంకర్ వివిధ పనిముట్ల ఉపయోగించి నాటు తుపాకులు తయారు చేస్తుండగా పట్టుకొని, అతని వద్ద రెండు తుపాకి బ్యారెల్, తుపాకుల తయారు చేయడానికి వాడే రంపము, సుత్తి, కత్తి, ఆకు రాయి, డ్రిల్లింగ్ మిషన్ ,దూడ మిషన్, ఎయిర్ బుల్లోజర్ స్వాధీనం చేసుకొని నిందుతున్నీ పై కేసు నమోదు చేసి  ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్  శ్రీనివాస్ కేసు తదుపరి దర్యాప్తు ప్రారంభించగా దర్యాప్తులో భాగంగా గజసింగవారం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ వద్ద  నాటు తుపాకులు కొనుగోలు చేసి జంతువుల వేటకు ఉపయోగిస్తున్న రాయలింగు చంద్రమౌళి, శాతవేణిహరీష్ లోగిడి గంగయ్య  లను అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు తుపాకులు నాలుగు ట్రిగర్ భాగాలు స్వాధీనం చేసుకొవడం జరిగిందని  తెలిపారు. పై నలుగురు నిందుతులను ఈ రోజు రిమాండ్ కి తరలించడం జరిగిందని తెలిపారు.

చాకచక్యంగా వ్యవహరించి నింధుతులను అరెస్ట్ చేసిన  ఎల్లారెడ్డిపేట్ సి.ఐ శ్రీనివాస్, గంభీరావుపేట ఎస్.ఐ రామ్మోహన్ మరియు సిబ్బంది ని  జిల్లా ఎస్పీ అభినందించారు.
ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ శ్రీనివాస్, ఎస్ .ఐ లు రామ్మోహన్,రమాకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.

02 Country Made Weapons,03 Iron barrels,04 Stigers మరియు Hammer, Knife, Saw, Leaf stone, Driller, Iron rods, Blower recovered .

🏠 Home