🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 August 2024, 4:47 am Posted by : HINDUSTAN

ఎసిబి వలలో జాయింట్ కలెక్టర్... ఔటర్ రింగురోడ్డు దగ్గర డబ్బు తీసుకుని రా..?

News Image


రంగారెడ్డి :  జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు.. అడిషనల్ కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి నివాసంలో కొనసాగుతున్న సోదాలు.. భూపాల్‌రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌పై ఏసీబీ దాడి.
బాధితుడు జక్కిడి ముత్యంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు తో  జాయింట్ కలెక్టర్ ను ట్రాప్ చేసిన ఏసిబి

ధరణి వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుండి 14 గుంటల భూమిని తొలగించాలని కోరిన బాధితుడు

ఈ పని చేసేందుకు ఎనిమిది లక్షలు డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ రెడ్డి.

బాధితుడు కారులో డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి చెబితేనే తాను డబ్బులు తీసుకున్నట్లు ఏసీబీకి చెప్పిన సీనియర్ అసిస్టెంట్

ఏసీబీ అధికారుల ముందే జాయింట్ కలెక్టర్కు ఫోన్ చేసిన సీనియర్ అసిస్టెంట్

పెద్ద అంబర్పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు డబ్బులు తీసుకురావాలని ఫోన్లో మాట్లాడిన జాయింట్ కలెక్టర్

పెద్దంబర్పేట్ వద్ద జాయింట్ కలెక్టర్ భూపాల్ రెడ్డి కి సీనియర్ అసిస్టెంట్ మధుమోహన్ డబ్బులు ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు

ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏసీబీ

🏠 Home