🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 August 2024, 5:07 pm Posted by : HINDUSTAN

ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

News Image

జాతీయం:  ప్రముఖ నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్ను మూశారు. ఆమె వయసు 84 సంవత్సరాలు. అనారో గ్యంతో బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఈరోజు తుదిశ్వాస విడిచారు.

భరతనాట్యం, కూచిపూడి నృత్యరీతుల్లో యామినీ కృష్ణమూర్తి విశేష పేరుప్ర ఖ్యాతులు పొందారు. ఆమె 1940లో ఆంధ్రప్రదేశ్ మదనపల్లెలో జన్మించారు. ప్రఖ్యాత నృత్యకారిణి, గురువు రుక్మిణీ దేవి అరుండేల్ వద్ద శిష్యరికం చేశారు.

1957లో చెన్నైలో తన మొదటి నాట్య ప్రదర్శన ఇచ్చారు. 1968లో పద్మశ్రీ, 1977లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 2016లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు.

యామినీ కృష్ణమూర్తి టీటీడీ ఆస్థాన నాట్యకళాకారిణి గానూ సేవలు అందించారు. ఆమె ఒడిస్సీ నృత్యరీతి లోనూ ప్రావీణ్యం సంపాదిం చడం విశేషం.

🏠 Home