🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 31 March 2024, 6:52 am Posted by : HINDUSTAN

మదనపల్లిలో రైతుపై హత్యాయత్నం...



*పట్టా ఒకరిదైతే పాసుబుక్కు మరొకరికిచ్చిన వీఆర్వో*..

*భూమికోసం గొడవపడ్డ ఇద్దరు రైతులు*

  *భూ యజమాని పై డూప్లికేట్ ఆన్ లైన్ లు పొందిన మరో రైతు కొడవలితో నరికి హత్య యత్నం*

*బాధిత రైతు నాగరాజ పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలింపు*

*కొడవలితో రైతు నాగరాజను నరికిన వ్యక్తి గతంలో మదనపల్లి రెడ్డి ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద యువకుడి తల నరికి వేరు చేసిన హత్య కేసులో ముద్దాయిగా సమాచారం*

అన్నమయ్య జిల్లా, మదనపల్లి మండలంలోని పాలెంకొండలో  రెవెన్యూ మోసాలకు  సామాన్య రైతుల మధ్య విభేదాలు తలెత్తి ఆదివారం ఉదయం గొడవలు చేసుకున్నారు. గొడవలు తారా స్థాయికి చేరడంతో  ఓ రైతును మరో రైతు కొడవలితో అందరికీ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుని వివరాల ప్రకారం.. పాలెం కొండకు చెందిన రైతు బి నాగరాజు(49) కు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి ఊరికి సమీపంలో ఉంది. పక్కనే నాలుగు లైన్ల జాతీయ రహదారి వెళుతూ ఉండడంతో భూములకు అమాంతంగా రేట్లు పెరిగాయి. ఆ భూమిపై కన్నేసిన చిన్నప్ప, మురళి, చిన్నక్కలు నాగరాజా పొలాన్ని ఆక్రమించుకోవడానికి గుట్టుగా భూమిని వారి పేరుతో ఆన్లైన్ చేయించుకున్నారు. అంతటితో ఆగకుండా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నడంతో నాగరాజ అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో నాగరాజపై చిన్నప్ప మురళి కొడవళ్లతో దాడి చేసి తల, వేళ్ళు తెగ నరికి హత్యాయత్నం కు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ బాధిత రైతును కుటుంబీకులు స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమించడంతో తిరుపతికి రిఫర్ చేశారు.. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో మదనపల్లి మండలం బెంగళూరులోనే రెడ్డి ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్ద ఓ యువకుడి ని దారుణంగా హత్య చేసి తల నరికి వేరు చేసిన కేసులో ముద్దాయిగా నరికిన వ్యక్తి ఉన్నట్లు సమాచారం

🏠 Home