🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 10 February 2024, 12:41 pm Posted by : HINDUSTAN

<em>సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు..</em>


సినీ హీరో మహేశ్‌బాబు కుమార్తె… సితార పేరుతో ఇన్వెస్ట్ మెంట్ లింకులు.. క్లిక్ చేస్తే అయిపోయినట్టే




సైబర్ మోసాలకు తెగబడుతున్న నేరగాళ్లు




ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు




ఇలాంటి వాటిని నమ్మొద్దన్న జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ




సైబర్ నేరగాళ్లు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు తనయ సితార పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఆమె పేరుపై ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ లింకులు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా ఆ లింకులపై క్లిక్ చేస్తే వారి ఖాతాలు గుల్లయినట్టే.




ఈ లింకులను గుర్తించిన జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మాట్లాడుతూ ఇలాంటి లింకులను నమ్మవద్దని, సెలబ్రిటీల పేరుతో వచ్చే ఇలాంటి లింకులపై క్లిక్ చేసి కష్టాలపాలు కావొద్దని సూచించింది..

🏠 Home