🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 08 February 2024, 11:24 am Posted by : HINDUSTAN

పెళ్లికి నిరాక‌రించింద‌ని యువతి దారుణ హత్య


నిర్మల్ జిల్లా:ఫిబ్రవరి 08నిర్మల్ జిల్లాలో దారుణం ఈరోజు జరిగింది. ఖానాపూర్ పరిధిలోని శివాజీనగర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమికుడు బరి తెగించాడు.




పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొడ్డలితో నరికిచంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు.




గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

🏠 Home