🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 January 2024, 12:19 pm Posted by : HINDUSTAN

ఐటీడీఏ ఉట్నూర్ సపోట పంట (ఫల సాయం) వేలం







ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఉట్నూర్ ఉద్యాన నర్సరీ (HNTC) లోని సపోట తోట ఫల సాయాన్ని వేలం వేయనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిణి చాహత్ బాజ్ పాయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉట్నూర్ ఉద్యాన నర్సరీ లో 128 సపోట చెట్లు ఉన్నాయని, యాజమాన్య పద్ధతులు పాటించి సాగు చేసినట్లు తెలిపారు.. సంవత్సరం పాటు రెండు పంటలకు కలిపి వేలం పాట ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వ్యాపారస్తులు, సంస్థలు ఈ నెల 19 వ తేదీన సాయంత్రం 4 గంటలకు ప్రాజెక్ట్ అధికారి, ఐటీడీఏ ఉట్నూర్ కార్యాలయం లో జరిగే వేలంపాట (ఓపెన్ టెండర్) లో పాల్గొనాలని పిఓ కోరారు. ఇతర వివరాల కొరకు ఉట్నూర్ ఐటీడీఏ లోని ప్రాజెక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ (PHO) ని సంప్రదించాలన్నారు.



🏠 Home