🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 29 October 2022, 7:42 am Posted by : HINDUSTAN

మంత్రి జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన తీన్మార్ మల్లన్న టీం





రిపబ్లిక్ హిందుస్థాన్ : ఆదిలాబాద్ జిల్లా లోని స్థానిక బస్టాండ్ వద్ద తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో క్యూ న్యూస్ ఆఫీస్ మీద దాడిని కండిస్తూ మంత్రి జగదీష్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్బంగా ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ తల్లా రవీందర్ మాట్లడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెరాసా పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తున్న అరాచకాలు, భూ కబ్జాలు చేస్తుంటే , కెసిఆర్ గెలువకుంటే పెన్షన్స్ రావు, తెలంగాణ తిస్కొచినందుకు జీవితాంతం కెసిఆర్ కి ఓటు వేయ్యాల అని ప్రశ్నించినందుకు క్యూ న్యూస్ పై దాడి చేయడని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా, ప్రశ్నించే గొంతుకను తొక్కలని చూసిన వాళ్ళకు ప్రజలలో పరాభవం తప్పదని హెచ్చరించారు.





🏠 Home