🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 20 May 2022, 11:59 am Posted by : HINDUSTAN

గుడిహత్నూర్ పరిసర ప్రాంతాల్లో జోరుగా టేకు చెట్ల నరికివేత...!?


రిపబ్లిక్ హిందుస్థాన్ : ప్రభుత్వం హరితహారం, పల్లె ప్రకృతి వనం, చెట్ల పెంపకం పేరిట వేల కోట్లు ఖర్చు  చేస్తుంటే కొంత మంది అధికారుల నిర్లక్ష్యం వల్ల ఉన్న చెట్లు గొడ్డలి వేటకు బలవుతున్నాయి.
శుక్రవారం రొజు ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం పరిధిలో ఉన్న అడవి నుండి ఎడ్ల బండ్లలలో అడవి నుండి టేకు చెట్లు నరికి తీసుకెళ్లారు.




ఎడ్ల బండిలో తీసుకెళ్లుతున్న టేకు చెట్టు కలప



అయితే అక్కడే ఉన్న ఆ  ప్రాంతానికి ఇంచార్జ్ అయినా ఓ అటవీశాఖ అధికారి 7 ఎడ్ల బండ్లకు సంబందించిన కలపతో వ్యక్తులతో మాట్లాడి కలపతో సహా వాటిని వదిలేసినట్లు సమాచారం. ఏదేమైనా అధికారులు లోతుగా విచారణ జరిపి బాద్యులైన వారి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారూ.

🏠 Home