🏠 republichindustan.in
Watermark
Newspaper Logo
Date of Publish : 29 March 2022, 4:36 pm Posted by : HINDUSTAN

బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరం



రిపబ్లిక్ హిందుస్థాన్ నల్లబెల్లి: రాష్ట్రంలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడడం లేదు. బాలికల ఉన్నత విద్య కోసం గురుకులాలు ఏర్పాటుచేసిన, కల్యాణ లక్ష్మి ఇస్తామని చెబుతున్న కొన్ని చోట్ల గుట్టుచప్పుడు కాకుండా చిట్టి తల్లులకు వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సంఘటననే మండలంలోని నరక పేట గ్రామంలో చోటు చేసుకుంది. బాల్య వివాహం జరిపిస్తున్నారనే సమాచారం మేరకు బాలల రక్షణ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు మరియు వివాహానికి సహకరించిన వారిపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ ఎన్. రాజారాం తెలిపారు.

🏠 Home